“ఇలాంటి సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” మూవీ మీద కామెంట్స్..!

Ads

ఇటీవల సౌత్, నార్త్ అనే తేడాలు లేకుండా అందరూ కలిసి సినిమాలు చేస్తున్నారు. సౌత్ లో ఉన్న డైరెక్టర్ నార్త్ లో సినిమాలు చేస్తున్నారు. జవాన్ సినిమాతో అట్లీ సౌత్ వాళ్ళ సత్తా నిరూపిస్తే, ఇప్పుడు రెండవ సారి సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో సౌత్ వాళ్ళ టేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే విషయాన్ని చూపించారు.

సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన రెండవ హిందీ సినిమా ఇది. అంతకుముందు అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ సినిమాకి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద హిట్ అయ్యింది.

animal review

ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్ లో బిజినెస్ చేసింది. సందీప్ రెడ్డి వంగా హీరోలని ఒక డిఫరెంట్ స్టైల్ లో చూపిస్తారు. దాంతో ఇప్పుడు రణబీర్ కపూర్ ని ఎలా చూపించారు అనే ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత మంది బాగుంది అంటే, మరి కొంత మంది మాత్రం సినిమా చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ మీద మాత్రం జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

animal review

Ads

ఒక సమయంలో హీరో రణబీర్ కపూర్ పాత్ర హీరోయిన్ రష్మిక మందన పాత్ర గీతాంజలిని తిడుతూ ఒక సీన్ ఉంటుంది. అది కాస్త ఎక్కువ అయ్యి హీరోయిన్ ని అవమానపరిచే వరకు వెళుతుంది. హీరోయిన్ ని బాగా కొట్టి తర్వాత తనే ఆయింట్మెంట్ రాస్తాడు. ఆ తర్వాత అతని మాటలు విని హీరోయిన్ కరిగిపోతుంది. ఇది చూసిన ప్రేక్షకులు కాస్త బాధగా ఫీల్ అయ్యారు. సాధారణంగా చాలా సినిమాల్లో హీరోయిన్ కి, హీరోకి మధ్య గొడవలు చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అది ఇంకొక లెవెల్ లో ఉంది. ఇద్దరి యాక్షన్ బాగున్నా కూడా మరీ ఇంత వైల్డ్ గా చూపించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా రిలీజ్ అయ్యే ముందు నుండి కూడా ఇంటర్వెల్ 18 నిమిషాలు ఉంటుంది అంటూ దాని గురించి చాలా చెప్పారు. కానీ దీనిపై కూడా కొంత మంది బాగుంది అంటే, కొంత మంది మాత్రం మరొక రకంగా స్పందిస్తున్నారు. లౌడ్ మ్యూజిక్, చాలా సినిమాల్లో ఉండే యాక్షన్ సీన్ లాగానే ఉంది పెద్ద కొత్తగా ఏమీ లేదు అని అంటున్నారు. హీరో యూజ్ చేసిన ఆయుధం బాగానే ఉన్నా కూడా అంత పెద్ద ఇంటర్వెల్ బ్లాక్ కాకుండా, ఇంకా కొంచెం చిన్నగా ఉన్నా కూడా దాని ప్రభావం అంతే గట్టిగా ఉండేది ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది మాత్రమే కాదు సినిమాకి సంబంధించి ఇంకా చాలా సీన్స్ మీద ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. మరి ప్రేక్షకులు సినిమాని ఎలా ఆదరిస్తారో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పుడే సినిమా రిజల్ట్ కరెక్ట్ గా వస్తుంది. ప్రస్తుతం అయితే యానిమల్ సినిమా థియేటర్లలో నడుస్తోంది.

ALSO READ : యానిమల్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

Previous articleయానిమల్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
Next article“ప్రభాస్” గురించి వేణు స్వామి చెప్పినట్టే జరిగిందా..? మరి ఇప్పుడు సలార్ ఎలా ఉంటుంది..?