“ఇలాంటి సీన్ ఎలా రాశారు..? దేవుళ్ళని ఇలా అనడం ఏంటి..?” అంటూ… “ది కేరళ స్టోరీ” మూవీ మీద కామెంట్స్..!

Ads

సినిమా విడుదల అయిన చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా ది కేరళ స్టోరీ. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇందులో హీరోయిన్ ఆదా శర్మ ఒక పాత్రలో నటించారు. ఈ సినిమాని 15 నుండి 20 కోట్లు బడ్జెట్ తో రూపొందించారు.

ఈ సినిమా 303.97 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో అదా శర్మతో పాటు, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ కూడా కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా మీద ఎన్నో కామెంట్స్ వచ్చాయి.

comments-on the kerala story scene

ఎన్నో వివాదాలు జరిగాయి. సినిమాలో నటించిన వారి మీద కూడా కామెంట్స్ వచ్చాయి. అందుకే అన్ని వివాదాలు ఉండడం వల్ల ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తొందరగా అవ్వలేదు. దాంతో ఇప్పుడు అవన్నీ క్లియర్ అయ్యాక ఓటీటీలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాని చూసి కామెంట్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిపోయింది. సోషల్ మీడియా అంతా కూడా ఈ సినిమా మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇందులోనూ ముఖ్యంగా ఒక సీన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

Ads

comments-on the kerala story scene

నలుగురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది. దేవుళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ విషయం గురించి చెప్తూ, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇలా చేశారు అంటూ చెప్తుంది. వాళ్ళని దేవుళ్ళుగా ఎలా కొలుస్తారు అని అంటుంది. ఈ సీన్ మీద సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

comments-on the kerala story scene

“ఇలాంటి సీన్ ఎలా రాశారు?” అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అదా శర్మ షాలిని ఉన్నికృష్ణన్ అనే పాత్రలో నటించారు. ఆమె మలయాళం లో మాట్లాడాలి. మలయాళం వాళ్లు ఈ సినిమా చూసి, “అదా శర్మ మాట్లాడిన మలయాళం సరిగ్గా లేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. సినిమా చూసి కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleశివకార్తికేయన్ పోషిస్తున్న ఈ “ముకుంద్ వరదరాజన్” ఎవరు..? ఈ వ్యక్తి గొప్పతనం ఏంటంటే..?
Next articleసలార్ లో ప్రభాస్ తల్లిగా నటించిన “ఈశ్వరి రావు” కి… ప్రభాస్ కి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.