భారతీయుడు – 2 లో సేనాపతి వయసు ఎంతో తెలుసా..? ఆయన ఎప్పుడు పుట్టారు అంటే..?

Ads

శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రం ఎటువంటి గ్రాండ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు .స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన ఒక సోల్జర్ ఆ తరువాత సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎలా స్పందిస్తాడు అనే విషయాన్ని.. కరప్షన్ కారణంగా మన సొసైటీ ఎంత డ్యామేజ్ అవుతోంది అనేదాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు శంకర్ .ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి భారతీయుడు 2 మూవీ త్వరలో విడుదల కాబోతోంది.

ఇక దీనికి సంబంధించి విడుదలైన ఒక ప్రోమో వీడియోలో భారతీయుడికి చావే లేదు అని కమలహాసన్ అనడం మనం చూసాం .ప్రస్తుతం దీనికి సంబంధించి మీమర్స్ పలు రకాల ట్రోల్స్ తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే భారతీయుడు చిత్రం వచ్చింది 1996లో అప్పటికే కమల్ హాసన్ ముసలివాడు. ఆ మూవీలో అతను స్వాతంత్ర సమరయోధుడుగా చూపించారు .ఆ మూవీ లో కమల్ హాసన్ కు సంబంధించిన బయోడేటా స్లిప్ లో అతని డేటాఫ్ బర్త్ 1918 గా కనపడుతుంది ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికీ భారతీయుడు వయసు 105 సంవత్సరాలు.

ఈ విషయాన్ని పసిగట్టిన మిమర్స్ దీనిపై పలు రకాల వీడియోస్ చేసి త్రోల్ చేస్తున్నారు. త్వరలో విడుదల కాబోయే భారతీయుడు 2 చిత్రంలో కమల్ కు సంబంధించిన ఫైటింగ్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి అని టాక్ .మరి 105 సంవత్సరాల భారతీయుడు అంత ఫిట్గా ఎలా ఉన్నాడు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మూవీస్ అంటే అంతే మరి.. ఇక్కడ ఓన్లీ మ్యాజిక్ ,లాజిక్ ఉండదు అంటున్నారు. మరి మూవీ మేకర్స్ ఈ చిన్ని విషయాన్ని ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదు..

watch video :

Previous articleసమాజంలో ఆడవాళ్లు మాత్రమే ఎదుర్కొనే 5 సమస్యలు..! వీటి నుండి విముక్తి దొరకదా..?
Next articleఅతడు సినిమాలో పిలిచినా రానంటావా పాటలో కనిపించిన ఈ ప్రముఖ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.