అతడు సినిమాలో పిలిచినా రానంటావా పాటలో కనిపించిన ఈ ప్రముఖ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అతడు. ఈ సినిమా అప్పుడు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా మహేష్ బాబు సినిమాల్లో బెస్ట్ సినిమాల ప్రస్తావన వస్తే ఈ సినిమా పేరు ఉంటుంది.

అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో కూడా ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. ఇందులో డైలాగ్స్, కామెడీ, పాటలు, ఎమోషన్స్ ఇలా అన్ని సమానంగా ఉండేలాగా చూసుకున్నారు. ఈ సినిమా మహేష్ బాబుకి స్టార్ గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక మెట్టు ఎక్కేలాగా చేసింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు.

మహేష్ బాబు, త్రిష కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హీరో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పరు. చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. కానీ అందులోనే మంచి డైలాగ్స్ ఉండేలాగా త్రివిక్రమ్ చూసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఒక పాటలో ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యారు. ఈ సినిమాలో పిలిచినా రానంటావా పాటలో పూజారిగా ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆయన ఎవరో గుర్తుపట్టారా? ఈపాటికి మీలో చాలా మందికి ఈయన ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది.

Ads

celebrity in pilichina ranantava athadu song

ఈ వ్యక్తి మరెవరో కాదు. వేణు స్వామి. అందులో వేణు స్వామి అలా కనిపిస్తారు. ఈ సినిమాలో మాత్రమే కాదు. జగపతి బాబు హీరోగా నటించిన పాండు సినిమాలో కూడా వేణు స్వామి ఒక పూజ చేసే వ్యక్తిగా కనిపిస్తారు. ఇప్పుడు వేణు స్వామి చాలా పాపులర్ అయిపోయారు. ఎంతో మంది నటీనటుల వ్యక్తిగత జీవితానికి, సినిమా జీవితానికి సంబంధించి వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని వేణు స్వామి చెప్పారు.

అంతే కాకుండా వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు అలాగే జరిగాయి. దాంతో వేణు స్వామి ఇంటర్వ్యూలు ఇవ్వడం, అందులో ఎవరైనా ఒక నటుడి గురించి కానీ, నటి గురించి కానీ చెప్పడం వంటివి చేస్తారు. అంతే కాకుండా వేణు స్వామి మామూలుగా కూడా ఒక మంచి జ్యోతిష్యులు. జ్యోతిష్యం గురించి వేణు స్వామి చెప్తారు. చాలా మంది సెలబ్రిటీల జీవితాలకి సంబంధించిన ఎన్నో విషయాలని వేణు స్వామి చెప్పారు.

watch video :

ALSO READ : హనుమాన్ సినిమాలో హీరోయిన్‌లో ఇది VFX చేసారా..? దీని అవసరం ఏం ఉంది..?

Previous articleభారతీయుడు – 2 లో సేనాపతి వయసు ఎంతో తెలుసా..? ఆయన ఎప్పుడు పుట్టారు అంటే..?
Next articleపాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘ర‌క్ష‌ణ‌’…టైటిల్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌