”ఆల్బర్ట్ ఐన్‌స్టీన్” శాకాహారాన్నే తీసుకునేవారా..? ఆయన ఆహారం గురించి చాలా మందికి తెలియని నిజాలివే..!

Ads

ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలియని వారు ఉండరు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. తత్వశాస్త్రంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రభావితమైన కృషి చేశారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను ఈయనే కనుగొనడం జరిగింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేసిన కృషికి 1921లో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు.

1951లో ప్రిన్స్ టౌన్ లోని అతని సోదరి మజా ఇంట్లో ఐన్స్టీన్ కన్ను మూసారు. అయితే ఐన్స్టీన్ ఎటువంటి ఆహారం తీసుకునేవారు అనే సందేహం చాలా మందిలో వుండే ఉంటుంది.

ఐన్స్టీన్ ఆహారానికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. ఆయన జీనియస్ అవడానికి కారణం ఏమిటో చాలామంది కనుగొనలేకపోయారు. నిజానికి ఆయన మెదడు ఎంతో అద్భుతంగా పని చేసేది. ఆయన ఆలోచన విధానం అన్నీ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా ఉండేవి. చాలామంది ఐన్స్టీన్ కనుగొన్న వాటిని చూసి అవాక్కవుతూ ఉంటారు. ఐన్స్టీన్ లాగ అవ్వాలని అనుకునే వాళ్ళు ఆయన ఏం తినేవారు అనేది కనుగొనడం మొదలుపెట్టారు. ఐన్స్టీన్ చేసే పని ఎంతో కష్టమైనది.

అందుకే చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం ఆహారాన్ని తినడం కూడా మర్చిపోవడంతో ఐన్స్టీన్ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇంటస్టైన్ల సమస్యలని ఎదుర్కోవడం జరిగింది. అయితే ఆయన ఆహారపు అలవాట్లకి సంబంధించిన పెద్దగా విషయాలు ఏమీ బయటపడలేదు. కానీ కొన్ని విషయాలు ఒక ఉత్తరం ద్వారా తెలుస్తున్నాయి. ఆయన ఆహారం గురించి ఐన్స్టీన్ ఒక ఉత్తరంలో కొన్ని వివరాలని రాశారు. ఐన్స్టీన్ శాకాహారి.

Ads

ఆయన శాకాహారమే తీసుకునే వారు. 1920 ల్లో ఆయనకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావడంతో ట్రీట్మెంట్ ని తీసుకున్నారు. అయితే ఆయన ఎప్పుడు శాకాహారి కింద మారారు అనేది సరిగ్గా తెలియదు. 1930లో రాసిన ఉత్తరం ప్రకారం చూస్తే ఆయన శాఖాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు రాశారు అలానే ఆయన ఈ ఆహారాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా రాశారు. శాఖాహారం తీసుకోవడం వాళ్ళ కేవలం జీవన శైలి మాత్రమే కాదు మనిషి పై చక్కటి ప్రభావం పడుతుందని ఆయన రాశారు. అయితే ఈయన చనిపోవడానికి కేవలం ఒక్క సంవత్సరం ముందు మాత్రమే పూర్తి శాకాహారం తీసుకోవడం మొదలుపెట్టారు.

ఆయన ఆఖరి రోజుల్లో శాఖాహారాన్ని మాత్రమే తిన్నారు. 30 మర్చి 1954లో ఆయన రాసిన ఉత్తరం ప్రకారం చూస్తే.. ఫ్యాట్, మాంసం, చేప ఇవి ఇక నా జీవితంలో లేవు అని రాశారు. ఇది కేవలం ఆయన చనిపోవడానికి ఏడాది ముందు మాత్రమే. మనుషులు ఎవరూ కూడా మాంసాహారిగా పుట్టకూడదని రాశారు. 1953లో ఆయన రాసిన ఉత్తరం ప్రకారం చూస్తే ఆయన మాంసం చేప తింటున్నందుకు బాధగా ఉందని అందులో రాశారు.

Previous articleమురారి ,బలగం ,బ్రో ఇలా చావు కాన్సెప్ట్ తో వచ్చిన 7 సినిమాలు…!
Next articleరిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ కాకపోతే స్టార్ హీరోల చిత్రాలైన డిజాస్టర్ కావాల్సిందే…