మురారి ,బలగం ,బ్రో ఇలా చావు కాన్సెప్ట్ తో వచ్చిన 7 సినిమాలు…!

Ads

సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. జీవితంలోని ప్రతి అంశాన్ని చిత్రీకరించి కనులకు కట్టినట్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేదే సినిమా. కొన్ని సినిమాలు చావు కాన్సెప్ట్ చూపిస్తూ మనిషి బ్రతికి ఉండగా ఎలా బ్రతకాలి అనే అంశాన్ని ఎంతో అందంగా తెరకెక్కిస్తుంటారు. మరి మురారి సినిమా దగ్గర నుంచి రీసెంట్గా విడుదలైన బ్రో చిత్రం వరకు ఇలా ఆఫ్టర్ డెత్ కాన్సెప్ట్స్ తో వచ్చిన మూవీస్ ఏమిటో చూద్దాం..

1 ) మురారి :

20 Years for 'Murari': Namrata Shirodkar remembers the Mahesh Babu starrer | Telugu Movie News - Times of India

మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో 2001న రిలీజ్ అయిన చిత్రం మురారి. ప్రతి 48 సంవత్సరాలకు శాపం కారణంగా ఆ వంశంలో ఒకరు మరణించడం సంభవిస్తుంది. ప్రస్తుతం హీరో వంతు కావడం ,అతని కోసం అతని బామ్మ పడే తపన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పట్లో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

2) చక్రం :

Watch Chakram Full HD Movie Online on ZEE5

ప్రభాస్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన చక్రం మూవీ హీరో క్యాన్సర్ తో బాధపడుతూ కూడా పదిమంది జీవితాలలో ఆనందం తేవాలి అని ప్రయత్నించే కాన్సెప్ట్ తో రూపొంది. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

3) ఆ నలుగురు :

Aa Naluguru (2004) - IMDb

నిజజీవితంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి, చనిపోయాక అతని వెనక ఎవరు ఉంటారు…సమాజానికి మనం ఏం చేస్తున్నాం.. అనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం ఆ నలుగురు. ఎంతో సందేశాత్మక చిత్రం కావడంతో మంచి సక్సెస్ అందుకుంది.

Ads

4) నేను నా రాక్షసి :

ఆత్మహత్య చేసుకునే వాళ్ళ వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే విచిత్రమైన అలవాటు కలిగిన హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. పూరి జగన్నాథ్ తీసిన ఈ చిత్రం కాన్సెప్ట్ జనాలకి అర్థం కాకపోవడంతో ఇది పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

5) ప్రతిరోజూ పండుగే:

చిన్నతనంలో పిల్లలను తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా కాపాడుతారు కానీ ఆ పిల్లలు ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు. అలా బాధపడే ఒక తాత ఆర్తి తీర్చడానికి ముందు వచ్చిన మనవడు మరియు క్యాన్సర్ తో బాధపడే ఆ తాత కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే ప్రతిరోజు పండుగే. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

6) బలగం:

ఒక మనిషి జీవితంలో సంపాదించుకునే ఆస్తి డబ్బు కాదు తన చుట్టూ తన అనే మనుషులు అని సందేశాన్ని ఇస్తూ హీరో తాత చావు చుట్టూ తిరిగే ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

7) బ్రో :

చనిపోయిన హీరోకు 90 రోజుల సమయం ఇస్తే అతని జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం బ్రో. మనిషికి చావు యొక్క గొప్పతనం తెలిస్తేనే బ్రతుకు యొక్క విలువ తెలుస్తుంది అనే మెసేజ్ నీకు కన్వెజ్ చేసే ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగానే నడుస్తుంది.

Previous articleఈ ఏడాది హిట్ ,ఫ్లాప్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్స్ తో మారుమోగిన చిత్రాలు ఇవే…
Next article”ఆల్బర్ట్ ఐన్‌స్టీన్” శాకాహారాన్నే తీసుకునేవారా..? ఆయన ఆహారం గురించి చాలా మందికి తెలియని నిజాలివే..!