వారసుడు సినిమాలోని ‘రంజితమే’ పాటలో హీరోయిన్ రష్మిక కన్నా ఎక్కువగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ గురించి తెలుసా?

Ads

స్టార్ హీరోల చిత్రాల నుండి వచ్చేవి ఎలాంటి అప్డేట్స్ అయినా సరే అభిమానులు వెంటనే అలర్ట్ అయిపోతారు. తమ అభిమాన హీరో సినిమా నుండి వచ్చిన అప్డేట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూంటారు. ఇక అందులో ఏమైనా ఆకర్షణీయంగా, కొత్తగా ఏం కనిపించినా సరే దాన్ని నెట్టింట్లో హాట్ టాపిక్ గా అయ్యేట్టు చేస్తుంటారు.

ప్రస్తుతం అలాంటిదే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ‘వారసుడు’ సినిమా నుండి ట్రెండ్ అవుతోంది. అది ఏమిటంటే ఆ మూవీలోని వీడియో సాంగ్ లో నర్తించిన ఒక బ్యూటీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దళపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ కు జంటగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. అయితే ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. వారసుడు థియేట్రికల్ వసూళ్లు తగ్గుతుండడంతో మేకర్స్ ఈ చిత్రం నుండి ఒక్కోక్కటిగా వీడియో సాంగ్ ని విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుండి రంజితమే అనే పాట విడుదల అయ్యి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ మాస్ బీట్ పాటలో హీరో విజయ్, హీరోయిన్ రష్మికలతో పాటుగా నర్తించిన సైడ్ డాన్సర్స్ కూడా హైలైట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పాట ఆఖరులో దళపతి విజయ్ పక్కన (కుడివైపున ఉన్న రెడ్ కలర్ డ్రెస్) ఉన్న అమ్మాయి ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తూ షెహనాయ్ ఊది మరి స్టెప్స్ వేసింది. దీంతో ప్రస్తుతం నెటిజన్స్ దృష్టి ఆ అమ్మాయి మీద పడింది. అంతే, అప్పటి నుండి ఆమె ఎవరు? ఆమె సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు, నెటిజన్స్. ఆ అమ్మాయి గురించిన వివరాల్లోకి వెళ్తే, ఆ అమ్మాయి పేరు అంబికా కోహ్లీ. కానీ ఇన్ స్టాగ్రామ్ లో తన ఐడి పేరు ‘పటాకా’ అని ఉంది.ఈమె ముంబైకి చెందినది. ఆమెకు సోషల్ మీడియాలో లక్షకు పైగా అంబికాని ఫాలో అవుతున్నారు. ఆమె డాన్స్ విడియోలతో పాటుగా, హాట్ ఫోటోషూట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. అంబిక ఒక వైపు మూవీస్ లో డాన్సర్ గా చేస్తూనే, మరో వైపు ప్రైవేట్ సాంగ్స్ లో కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందట. ప్రస్తుతం అయితే రంజితమే పాటలో విజయ్, రష్మికల పక్కన ఆమె చేసిన స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి.

Ads

Also read: ఒక‌ప్పుడు క్రేజీ హీరో ‘వడ్డే నవీన్’ ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఎలా ఉన్నారో తెలుసా?

 

View this post on Instagram

 

A post shared by 👑Ambika kohli👑 (@_pataaka__)

Previous articleఈ 7 మంది హీరోయిన్లు బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉన్నారు అనుకుంటా…? చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ ఇవే.!
Next articleకాలములో “12 ” గొప్పతనము ఏమిటి..? ఇంత ఉందని మీకు తెలీదా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.