మీ ఇంట్లో గీజర్ ఉందా..? అయితే ఎట్టిపరిస్థితిలోను ఈ తప్పులని చెయ్యకండి..!

Ads

ఇప్పుడు సదుపాయాలు బాగా పెరిగిపోయాయి. సదుపాయాలు పెరిగిపోవడంతో అన్ని ఈజీ అయిపోతున్నాయి. ఇది వరకు ప్రతి చిన్న పని కూడా ఎంతో సమయం పట్టేది. పైగా ఎంతో కష్టపడే వాళ్ళు మన పూర్వీకులు. టెక్నాలజీ కూడా విపరీతంగా అభివృద్ధి చెందింది. దీనితో ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్రికల్ వస్తువులని ఉపయోగిస్తున్నారు. స్నానం చేయాలంటే మనకి వేడి నీళ్లు కావాలి. అందులోనూ ఇది చలికాలం. కనుక వేడి నీళ్లతోనే స్నానం చేస్తూ ఉంటాము.

మనం చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. వేడి నీళ్ల కోసం చాలా మంది ఇళ్లల్లో గీజర్ ని ఫిక్స్ చేయించుకుంటూ ఉంటారు.

స్నానానికి కాసేపు ముందు మనం స్విచ్ వేసి ఉంచితే సరిపోతుంది. మీ ఇంట్లో కూడా గీజర్ ఉందా అయితే అసలు ఈ పొరపాట్లని చేయకండి. ఈ పొరపాట్లు చేస్తే ఎంతో ఇబ్బంది పడాలి. చాలా సందర్భాలలో గీజర్ వలన చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఎలక్ట్రానిక్ వస్తువు ఉపయోగించిన సరే జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం తప్పదు. గీజర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు చూసేద్దాం.

Ads

  • చాలామంది గీజర్ ని ఒకసారి ఆన్ చేసిన తర్వాత దానిని మళ్లీ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఆ కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది చూసుకోండి.
  • ఒకవేళ కనుక మీరు గీజర్ ని ఆఫ్ చేయడం మర్చిపోతారు అని మీకు అనిపిస్తే అలారం పెట్టుకుని ఆఫ్ చేయడం మంచిది లేకపోతే ఎవరినైనా గుర్తు చేయమనండి.
  • ఎక్కువసేపు కనుక గీజర్ ఆన్ లో ఉంటే అది పేలే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి టైం కి ఆఫ్ చేయడం మర్చిపోకండి.

  • గీజర్ ని ఫిక్స్ చేసేటప్పుడు నిపుణులు మాత్రమే దానిని ఫిక్స్ చేయాలి చాలా మంది వాళ్ళకి ఈ పని తెలుసు అని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రమాదమే గుర్తుంచుకోండి. గీజర్ షాప్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆ తప్పు చేయొద్దు.
  • గీజర్ ని మీ వాష్ రూమ్ లో ఉంచినప్పుడు కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని పెట్టించుకోండి ఎందుకంటే గీజర్ లో బ్యూటేన్, ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. అవి కార్బన్ డయాక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి సో మీరు కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఫిక్స్ చేయించుకోండి. ఒకవేళ కనుక మీ గీజర్ రిపేర్ అయితే కచ్చితంగా ఎలక్ట్రీషియన్ ని రమ్మని చెప్పండి అంతేకానీ ఆన్లైన్లో చూసి కానీ మీకు తెలిసీ తెలియని జ్ఞానంతో కానీ దాన్ని రిపేర్ చెయ్యద్దు.
Previous article”30 ఇయర్స్ పృథ్వీ” కూతురిని చూసారా..? హీరోయిన్ గా రాబోతోంది మీకు తెలుసా..?
Next article200 నుండి 100 కిలోల బరువు తగ్గిన ”అనంత్ అంబానీ”… మళ్ళీ ఎందుకు బరువు పెరిగిపోయాడు..?