హీరో విక్రమ్ లవ్ స్టోరీ తెలుసా.? తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.!

Ads

సాధారణంగా సినిమాలలో హీరోలు ప్రేమించి, పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే అలాగే నిజ జీవితంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక ఆ హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన లవ్ స్టోరి ఉంటుంది.

అయితే అలా చేసుకున్న వారిలో కోలీవుడ్ హీరోల ప్రేమకథలు చాలా ఆసక్తిగా ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్ హీరో విక్రమ్, ఆయనని అక్కడ అందరు ప్రేమగా చియాన్ అని పిలుచుకుంటారు. ఇక హీరో విక్రమ్ లవ్ స్టోరి సినిమా కథకి ఏమాత్రం తీసిపోదు. మరి హీరో విక్రమ్ లవ్ స్టోరి గురించి ఇప్పుడు చూద్దాం..
1992లో హీరో విక్రమ్ కి శైలజ బాలకృష్ణన్ తో వివాహం జరిగింది. గురువయ్యూర్ లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు కొడుకు ధృవ్ విక్రమ్, కూతురు అక్షిత. ప్రస్తుతం విక్రమ్ కొడుకు ధృవ్ కూడా హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక హీరో విక్రమ్ లవ్ స్టోరి విషయానికి వస్తే, ఈ ఇద్దరి పరిచయం విక్రమ్ చదువుకునే రోజుల్లోనే జరిగిందంట. విక్రమ్ ఎంబీఏ చేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం జరిగిన తరువాత దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆయన బెడ్ మీదనే ఉండాల్సి వచ్చింది.
ఇక అలాంటి పరిస్థితుల్లోనే హీరో విక్రమ్ జీవితంలోకి అడుగు పెట్టింది డాక్టర్ శైలజ బాలకృష్ణన్. డాక్టర్ గా పరిచయం అయింది శైలజ. ఆ తరువాత వారిద్దరి మధ్య స్నేహంగా మారింది. అది కాస్తా ఆ తరువాత ప్రేమగా మారింది. అలా విక్రమ్ తనకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ నే ప్రేమించాడు. శైలజ ఇంట్లో చెప్పక ముందే విక్రమ్ ఒక చీర తీసుకెళ్ళి శైలజ పేరెంట్స్ తో పెళ్లి గురించి చెప్పాడు.

Ads

శైలజ హిందువు కాగా, విక్రమ్ క్రైస్తవ మతానికి చెందినవ్యక్తి. ఇక 5 సంవత్సరాల డేటింగ్ తరువాత పెద్దల అనుమతితో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. హిందూ వివాహ పద్దతిలో ఒకసారి, అలాగే క్రైస్తవ వివాహ పద్దతిలో చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఇక డాక్టర్ గా సంపాదించిన డబ్బుని శైలజ విక్రమ్ హీరోగా ఎదగడానికి ఉపయోగించి, సహకారం అందించేది. సేతు మూవీ ప్రమోషన్ చేయడం కోసం విక్రమ్ భార్య శైలజ సేవింగ్స్ మొత్తాన్ని ఖర్చు చేశాడు. భార్య సహాయంతో ఆయన ఆ తర్వాత పెద్ద స్టార్ గా ఎదిగాడు.

Also Read: జక్కన్న ఇచ్చిన హింట్ ను మనమే గుర్తు పట్టలేదు.. ఆ హింట్ ఏమిటో తెలుసా?

Previous articleఅనసూయ భరద్వాజ్ ల ప్రేమ కథ మీకు తెలుసా..?
Next articleశ్రీమంతుడు నుండి బలగం వరకు.. స్టోరీని కాపీ చేసారనే ఆరోపణలు ఎదుర్కొన్న 11 చిత్రాల జాబితా..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.