Ads
పెళ్లి అనేది ప్రతి ఒక్కరు జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. అయితే కొందరికి పెళ్లి మంచి అనుభవాన్ని ఇస్తే మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. చాలామంది కనీస అవగాహన లేకుండా పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి సంసార జీవితం మంచి సాఫీగా సాగిపోతూ ఉంటుంది.
కొంతమందికి ఎప్పుడు చూసినా ఓడిదుడుకులు కష్టాలతో నిండి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలామంది అబ్బాయిలు పెళ్లి వద్దు అని అనుకుంటున్నారట. అసలు ఎందుకు వద్దు అనుకుంటున్నారు అనేదానికి చాలా కారణాలు చెబుతున్నారు. వాటిలో ఒకసారి ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే…
1. చాలామంది మగవాళ్ళు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోవడానికి కారణం పర్ఫెక్ట్ సోల్ మేట్ కోసం వెయిట్ చేయడమే. ఒకవేళ తమకు నచ్చిన పర్సన్ దొరక్కపోతే ఇబ్బందులు పడాలని పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్నారట. వారికి అనుగుణంగా ఉండే వారి కోసం ఎదురుచూస్తూ ఖాళీగానే మిగిలిపోతున్నారు.
2. కొంతమంది కుటుంబ కారణాలవల్ల పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అయితే తమ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని సర్దుకుపోతూ రేపు మనకి పెళ్లి అయితే వచ్చే వచ్చే అమ్మాయి ఆమె ఫ్యామిలీతో కూడా ఎలా డీల్ చేయాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనుకుంటున్నారు. ఫ్యామిలీలు ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని భయపడుతున్నారట.
Ads
3. కొంతమంది పెళ్లి చేసుకోవడం అంటే స్వేచ్ఛను వదులుకోవడమే అని భావిస్తున్నారు. తమ కోరికలను, లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ దూరమైతాయని భయాలు వారిలో ఉన్నాయట.
4. అబ్బాయిలు పుట్టిన దగ్గర నుండి రెస్పాన్సిబిలిటీలను నెరవేర్చుకుంటూ వెళ్తుంటారు. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ,తర్వాత టీచర్లు ఎక్స్పెక్టేషన్స్ ,తర్వాత కెరీర్ మీద ఎక్స్పెక్టేషన్ లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. రేపు పెళ్లయితే వచ్చే అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వాలి అనే భయం వారిలో ఉంటుందట.
5. సక్సెస్ఫుల్ మ్యారేజస్ కంటే డైవర్స్ తో ముగిసిన మ్యారేజ్ లు ఎక్కువుగా ఉన్నాయి. 50 శాతం మగవాళ్ళు విడాకులు తీసుకున్న జాబితాలో ఉన్నారు. విడాకుల తర్వాత భరణం చెల్లించడం, తర్వాత పిల్లల బాధ్యతలు ఇలా ఇవన్నీ చూసి చాలా మంది పెళ్ళికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.
6. ప్రస్తుతం అబ్బాయిలు ఒంటరిగా ఉండడానికి భయపడటం లేదు. ఒక తోడుండాలని కూడా కోరుకోవడం లేదు. వారికోసం వారు బతకాలని అనుకుంటున్నారు. పెళ్లి అనేది ఒక ఛాయిస్ లా మాత్రమే చూస్తున్నారు.
ALSO READ : అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రేయసి ఎవరో తెలుసా..? వీరి ప్రేమ కథ ఏంటంటే..?