సీమంతం వేడుక జరుపుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

Ads

ధైర్యం సినిమాలో నటించిన హీరోయిన్ అంటే మీకు 2004 లో రిలీజ్ అయిన నితిన్ సినిమా లో హీరోయిన్ రైమాసేన్ గుర్తుకు వస్తుంది కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది కన్నడ సినిమాలో మొట్టమొదటిసారిగా ధైర్యం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం ఉండదు.

కానీ కన్నడ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు అదితి ప్రభుదేవా గురించి. ధైర్యం తర్వాత బ్రహ్మచారి ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి, చాప్టర్ 1 లాంటి చిత్రాలతో కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.ఈమె నటించిన అలెక్సా చిత్రం గత నెల 26న రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

baby shower function of a heroine

అయితే సినిమాలలో బిజీగా ఉండగానే 2022లో వ్యాపారవేత్త యషాస్ ను వివాహం చేసుకుంది. ఇటీవల అదితి తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరులోని ఆమె నివాసంలో అదితికి ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బంధువులు సన్నిహితులు పాల్గొన్నారు. శాండిల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు కూడా ఈ వేడుకకు హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు.

Ads

ప్రస్తుతం అదితి సీమంతం ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అదితి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆమె శ్రేయస్సును కోరుకుంటూ విషెస్ చెప్తున్నారు. అదితి గర్భం ధరించిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. తన ఇన్స్టాలో తన భావోద్వేగాన్ని ఇలా వ్యక్తపరిచారు. బంధుత్వం చాలా గొప్పది, పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుంచి వచ్చే ఏకైక పదం అమ్మ.

జీవితంలో ప్రతి ఒక్కరిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం కూడా అమ్మ. మనకోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మ అలాంటి గొప్ప బంధం నేను 2024లో పొందబోతున్నాను అంటూ తన ఫీలింగ్ ని షేర్ చేసుకున్నారు. అలాగే బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ సుఖ ప్రసవం కావాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Previous articleఏడుగురు ఆడపిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలే.. ఒక తండ్రి స్ఫూర్తిదాయక కథ!
Next articleఆడాళ్ళు మీకు జోహార్లు.. మందు విషయంలో కూడా ఎక్కడా తగ్గని ఆడవాళ్లు!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.