ఆడాళ్ళు మీకు జోహార్లు.. మందు విషయంలో కూడా ఎక్కడా తగ్గని ఆడవాళ్లు!

Ads

సమాజంలో ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతి పనిలోనూ తమ సత్తా చాటుకుంటున్నారు. మగవాళ్ళకన్నా మేము ఎందులోనూ తీసిపోము అని నిరూపిస్తున్నారు. ఆఖరికి మద్యం సేవించడంలో కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ మగవాళ్ళతో పోటీ పడుతున్నారు.

అలాగే ఈ మధ్య జరిగిన ఒక ఫంక్షన్ కి వచ్చిన అతిథులకు భోజనాలు వడ్డించి దాంతోపాటు ఆల్కహాల్ కూడా అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో వింతేముంది పెళ్ళంటేనే మందులు చిందులు ఉంటాయి కదా అంటారేమో.. కానీ నేను చెప్తున్నది ఆడవాళ్ళ గురించి.

women serving at function

మహిళలు కూర్చున్న బంతిలో భోజనాలతో పాటు వారికి గ్లాసుల్లో మద్యం కూడా పోస్తున్నారు. అది కూడా ఆడవాళ్లు సర్వ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో పై ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. అయితే ఇది ఏదో ఫంక్షన్ కి సంబంధించిన వీడియో అని అర్థమవుతుంది కానీ ఎక్కడ ఏంటి అనేది తెలియలేదు. వీడియోలో చాలా మంది మహిళలు పంక్తి భోజనం చేస్తున్నారు. అక్కడికి ముగ్గురు నలుగురు మహిళలు వంతుల వారీగా వచ్చి గ్లాసులలో మద్యం అందిస్తున్నారు.

Ads

గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ వీడియోలో కనిపిస్తున్న వారిలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. అయితే కొందరు మహిళలు మద్యం తీసుకోవడానికి నిరాకరించారు కానీ కొందరు మహిళలు అక్కడ పెట్టు అంటూ గట్టిగానే అడుగుతున్నారు. మద్యం తాగుతున్న మహిళల ఫోటోలు తీస్తున్న కెమెరామెన్ కూడా వీడియోలో కనిపించడం విశేషం. ఈ వీడియో పై నేటిజెన్సు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక్కడ మహిళలకు అందిస్తున్నట్లుగా వారి స్థానంలో మగవారికి మద్యం ఎక్కడా అందించరు అదేంటో మరి అంటూ ఒక వినియోగదారుడు అసహనం వ్యక్తం చేశాడు.మహిళలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మరో నెటిజన్ స్పందించారు. ఏది ఏమైనా ఆడవాళ్ళకి ఇలాంటి భాగ్యం అందించిన ఆ ఫంక్షన్ చేసిన వాళ్ళకి ఎంతమంది కృతజ్ఞతలు తెలుపుకున్నారో అంటూ మరొక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Previous articleసీమంతం వేడుక జరుపుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Next articleదాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఫంక్షన్ లో “నయనతార” కట్టుకున్న ఈ చీర విలువ ఎంతో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.