ఈ స్థాయికి రావడానికి.. ”ప్రభాస్” ఇంత కష్టపడ్డాడా..?

Ads

బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకు వెళ్లిపోతున్నాడు ప్రభాస్. ప్రభాస్ కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా ఇప్పుడు మాత్రం ఒక రేంజ్ లో దూసుకు వెళ్తున్నాడు. పైగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ప్రభాస్ నటన కి చాలా మంది ఫిదా అయిపోతారు. టాలీవుడ్ లోనే కాదు ఇతర ఇండస్ట్రీ లో కూడా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రభాస్ 2022లో ఈశ్వర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కి అంత హిట్ టాక్ రాలేదు.

Ads

ఏవరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమా చేశాడు. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ తర్వాత వచ్చిన వర్షం సినిమా మాత్రం ప్రభాస్ కి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమా లో ప్రభాస్ సరసం త్రిష నటించింది. తర్వాత రెండు మూడు చిత్రాలు చేసినప్పటికీ ఆ రెండు మూడు చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అయితే ఏ హీరో కి అయినా సరే సక్సెస్ రావాలన్నా ఒక ఫామ్ లో పడాలన్న సమయం పడుతుంది. ప్రభాస్ కి కూడా అలానే సమయం పట్టింది.

కెరియర్ మొదట్లో ప్రభాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. హీరోయిన్స్ వల్ల సినిమా పాటల వల్ల సక్సెస్ అయ్యాడని విమర్శలని ఎదుర్కొన్నాడు. తర్వాత చత్రపతి సినిమా తో ప్రభాస్ మంచి హిట్ ని కొట్టాడు తర్వాత చక్కటి సినిమాలను ఎంచుకుంటూ స్టార్ హీరోల్లో ఒకడు అయ్యాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకు వెళ్ళిపోతున్నాడు. ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో వారు కూడా చూస్తున్నారు.

Previous articleరిటైర్ అయ్యాక క్రికెటర్లు ఏం చేస్తారు..? ఈ 4 క్రికెటర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?
Next articleఅజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌ కళ్యాణ్ మెడలో ధరించిన లాకెట్‌ గురించి తెలుసా?