ఈ ముగ్గురు స్టార్ హీరోల విజయం వెనుక ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరంటే..?

Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే కొందరు మాత్రం నెంబర్ తో సంబంధం లేకుండా వారి సినిమాలు వారు చేసుకుంటూ వెళ్తున్నారు, సక్సెస్ ని అందుకుంటున్నారు. అలాంటి వారిలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. నెంబర్ వన్ గేమ్ గురించి పట్టించుకోని ఈ హీరోలు తమ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ ముగ్గురు హీరోల జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన వెనుక ఒకే హీరోయిన్ ఉండటం అనేది కాకతాళియం. అదేంటంటే ఈ ముగ్గురు హీరోలు సాధించిన మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్లు సాధించిన సినిమాలన్నిటిలోనూ హీరోయిన్ భూమిక కావటం విశేషం. భూమిక పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమా చేసింది ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Ads

ఇంకా చెప్పాలంటే తొలిప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ కి అంత పెద్ద హిట్ ఇచ్చిన సినిమా ఖుషి. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా సింహాద్రి. ఈ సినిమాలో కూడా భూమిక హీరోయిన్ కావటం, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కి ఆది తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చిన సినిమా సింహాద్రి.ఆ తర్వాత మహేష్ బాబు తో నటించిన సినిమా ఒక్కడు ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది.

ఈ మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు సాధించడం ఈ సినిమాలన్నింటిలోనూ హీరోయిన్ భూమిక కావటం పెద్ద విశేషం. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాల తరువాతే ఆ హీరోలు ముగ్గురు స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భూమిక పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ముఖ్య పాత్రలు నటిస్తూ మెప్పిస్తుంది.

Previous articleవందేళ్ల క్రితం ప్రేమ లేఖని ఎప్పుడైనా చూసారా..? దానిలో ఏం రాశారంటే..?
Next articleబోటనీ పాఠముంది…అంటూ నాగ్ తో స్టెప్పులేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.