బోటనీ పాఠముంది…అంటూ నాగ్ తో స్టెప్పులేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Ads

కింగ్ నాగార్జున సినీ కెరియర్లో మరపురాని మైలురాయిగా మిగిలిపోయిన చిత్రం శివ. ఈ సినిమాను సైకిల్ చైన్ సీన్ సృష్టించిన సునామీ అప్పట్లో అంతా ఇంతా కాదు. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట విడుదలైన ఈ చిత్రం సినీ ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలబడింది. చిత్రం కథ ,కథనం, సాంకేతిక విలువలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ మూవీతో కొత్త డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అని నిర్మాతలకు భరోసా కలిగింది. ఈ మూవీలో నాగార్జున సరసన హీరోయిన్గా అమల నటించారు.

Ads

రాంగోపాల్ వర్మ తన మొదటి చిత్రంతోనే దర్శకుడిగా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి శివ మూవీ కారణం. అయితే ఈ మూవీలో బాగా ఫేమస్ అయిన బోటనీ పాఠముంది మేటననీ ఆట ఉంది అనే పాటలో నాగార్జున వెనుక స్టెప్పులు వేశాడు ఓ స్టార్ డైరెక్టర్. అవును ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ నాగార్జున వెనుక ఒక కాలేజీ స్టూడెంట్ గా నటించారు.

రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్లో…బ్లూ షాట్లో కనిపించే నాటి జూనియర్ ఆర్టిస్ట్.. నేటి సూపర్ డైరెక్టర్…పూరి…హే హీరో వాట్ ఏ జర్నీ…అని ఆ పాత ఫోటోను పోస్ట్ చేశారు. దానికి స్పందించిన పూరి అంతా మీ దయ వల్లే సార్ అంటూ థాంక్స్ చెప్పారు. అయితే పూరి జగన్నాధ్ ఒకప్పుడు అలా ఉండేవారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Previous articleఈ ముగ్గురు స్టార్ హీరోల విజయం వెనుక ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరంటే..?
Next articleసుధా మూర్తి లాంటి సెలబ్రిటీ ని కూడా మైమరపించే ఆ పాట ఏమిటో తెలుసా?