2 ఏళ్లుగా వెంటబడి బిగ్ బాస్ హౌస్ లోకి…”పల్లవి” అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే.?

Ads

ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ విన్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించే ఎక్కువ చర్చ వినిపిస్తోంది. ఇంతకుముందు సీజన్ వైఫల్యాలను తిరిగి రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో సీజన్ 7 ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు.

ఈ నేపథ్యంలో హౌస్ లోకి ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ ఎంపిక ఎంతో ఆచితూచి చేయడం జరిగింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ లో కామన్ మ్యాన్ గా వచ్చిన వ్యక్తి పల్లవి ప్రశాంత్.

కామన్ మ్యాన్ కోటాలో ఎంటర్ అవుతూనే అందరి దగ్గర రైతుబిడ్డగా మంచి మార్కులు కొట్టేశాడు పల్లవి ప్రశాంత్. ఇప్పటికీ బిగ్ బాస్ హిందీ షో ప్రారంభమై 16 సంవత్సరాలు గడుస్తోంది.. అలాగే మిగిలిన భాషల్లో కూడా చాలా ఏళ్లుగా ఈ షో నడుస్తోంది. అయితే మొట్టమొదటిసారి ఒక కామన్ ఫార్మర్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చిన ఇన్సిడెంట్ మాత్రం కేవలం తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో జరిగింది.

దీంతో పల్లవి ప్రశాంత్ పేరు కేవలం తెలుగు బిగ్ బాస్ లోనే కాక మిగిలిన ప్రాంతాల్లో కూడా బాగా ఫేమస్ అయింది. పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తాను పుట్టకముందు దేవుడికి మొక్కుకున్నారు. అందుకే పల్లవి ప్రశాంత్ పుట్టిన తర్వాత అతనికి పేరులో పల్లవి అనే పదం కూడా పెట్టారు. ఇంతకుముందే సోషల్ మీడియాలో వ్యవసాయానికి సంబంధించిన పలు రకాల వీడియోలు చేయడం వల్ల పల్లవి ప్రశాంత్ బాగా ఫేమస్ అయ్యాడు. అతనికి ఫాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

అయితే గత రెండు మూడు సీజన్ల నుంచి తనను బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా తీసుకోవాల్సిందిగా కోరుతూ అతని పలు రకాల వీడియోలు పోస్ట్ చేశారు. ఇదే కారణంగా అతనికి ఈ సీజన్ బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యే ఆస్కారాన్ని కల్పించారు నిర్వాహకులు. ఎలాగైతేనే ఫైనల్ గా తాను అనుకున్నట్లుగానే బిగ్ బాస్ హౌస్ లోకి పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Previous articleజైలర్ నిర్మాత ఉపాసన తాతగారికి చెక్ ఎందుకు ఇచ్చారో తెలుసా.?
Next article43 ఏళ్లు వచ్చినా…. ఒకప్పటి హీరోయిన్ “కౌసల్య” ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?