అచ్చం వై.ఎస్.భారతి లా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Ads

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత ఏడాది తన రాజకీయ చిత్రం “వ్యూహం” మూవీ ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. సినిమాలోని పాత్రలకు జీవం పోసే ప్రతిభావంతులైన నటీనటులను ఎంచుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా. మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటుంటారు. కానీ వారు ఎక్కడ ఉంటారో ఎవరూ చెప్పలేరు. కానీ, అలాంటి వారిని వెతికి పట్టుకుని మరీ ఆర్జీవీ తన సినిమాలో పెడతారు. ఆర్జీవీ నిజ జీవిత పాత్రలను ఆధారంగా రూపొందించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

వాటిల్లో నటీనటులు నిజంగానే నిజ జీవిత పాత్రలను పోలినట్లు ఉంటారు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం సినిమా పనులతో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ఆకట్టుకుంది. తాజాగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో వై ఎస్ భారతి గారిలా కనిపిస్తున్న అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె ఎవరు అని సోషల్ మీడియాలో ఆమె గురించి తెగ వెతికేస్తున్నారు.

ఈ అమ్మాయి పేరు మానస రాధాకృష్ణన్. ఆమె కేరళలోని ఎర్నాకులంలో రాధాకృష్ణన్ V. K. మరియు శ్రీకళ దంపతులకు జన్మించింది. ఆమె దుబాయ్‌లో పెరిగింది. ఆమె 10వ తరగతి వరకు దుబాయ్‌లోని ఇండియన్ హై స్కూల్‌లో చదివింది మరియు ఆమె ఉన్నత మాధ్యమిక విద్య త్రిప్పునితురలోని ది ఛాయిస్ స్కూల్‌లో జరిగింది. ఆమె భారతీయ శాస్త్రీయ నృత్యం, సినిమాటిక్ డ్యాన్స్ మరియు గిటార్ నేర్చుకుంది.

watch video:

మానస ప్రస్తుతం ముత్తూట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (MITS)లో కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ చదువుతోంది. 2008లో వచ్చిన కన్నునీరినుమ్ మధురం సినిమాలో మానస చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసారు. కదక్షం, పౌలెట్టంటే వీడు, బాలస మరియు విల్లాలి వీరన్‌ సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. పరమగురు చిత్రంతో తమిళంలో కూడా ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతేడాది హై వే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Previous articleబిగ్ బాస్ 6 ఫెయిల్ అయినందుకేనా బిగ్ బాస్ 7 లో ఇలా చేసారు.? ఏకంగా మొదటి నామినేషన్ లోనే.?
Next articleఅతను ఉంటే ఇండియా టీం ఓడిపోతుంది…ఆ శనిగాడి కోసం అంత మంచి ప్లేయర్ ని పక్కన పెడతావా రోహిత్.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.