బిగ్‌బాస్ గురించి తెలీదు అన్నాడు… మరి బిగ్‌బాస్ 6 లో ఆడియన్స్ గా.?

Ads

చాలా తక్కువ అంచనాలతో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇప్పుడు టాప్ స్థానంలో దూసుకుపోతోంది. గత సీజన్ అంత పెద్దగా హిట్ అవ్వకపోవడం వల్ల ఈ సీజన్ మీద పెద్దగా ఎవరికి ఆసక్తి లేదు. కానీ ఎపిసోడ్స్ నడుస్తున్న కొద్ది సీజన్ మీద ఆసక్తి పెరుగుతోంది. ఈ సారి కంటెస్టెంట్స్ లో కొంత మంది తెలిసినవారు, చాలా మంది అంత బాగా తెలియని వారు ఉన్నారు. దాంతో అసలు వాళ్ళు ఎవరు? వారి కథ ఏంటి? అనేది ఎపిసోడ్స్ నడుస్తున్న కొద్ది తెలుస్తోంది.

bigg boss telugu 7 pallavi prashanth as audience in bigg boss telugu 6

ఇది తెలుసుకోవడానికి అయినా సరే ప్రేక్షకులు ఈ సీజన్ లో ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తున్నారు. అంతే కాకుండా సినిమాల్లో, సీరియల్స్ లో మనకి కనిపించేవారు నిజ జీవితంలో ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి కూడా ఈ షో చూసేవారు ఉంటారు. అయితే తాను రైతు బిడ్డని అని, తను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అని, బిగ్ బాస్ షో తనకి గుర్తింపు తీసుకురావడానికి ఒక అవకాశం అని చెప్తూ షోలోకి అడుగుపెట్టిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. మొదట్లో పల్లవి ప్రశాంత్ కష్టాలు చూసి అందరూ జాలిపడ్డారు.

కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది, “పల్లవి ప్రశాంత్ ముందే అంత ప్లాన్ చేసుకొని వచ్చాడు” అని అంటున్నారు. షోలో తన తోటి హౌస్ మేట్స్ కూడా ఇదే మాటని చాలా సార్లు అంటున్నారు. పల్లవి ప్రశాంత్ ఆడే విధానం, అతను మాట్లాడే విధానం, ఆలోచన, దాన్ని అమలు చేసే స్ట్రాటజీ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ గా ఉండడంతో అందరూ ఈ మాట అంటున్నారు.

ఒక సందర్భంలో నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ ఒక కంటెస్టెంట్ “అసలు బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసి వచ్చి, ఇప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడుతున్నావు” అని అన్నప్పుడు, అందుకు పల్లవి ప్రశాంత్ జవాబు ఇస్తూ, “అసలు తనకి బిగ్ బాస్ అంటేనే తెలియదు” అని ఉద్దేశం వచ్చేలాగా సమాధానం చెప్పాడు.

bigg boss telugu 7 nominations prashanth amardeep issue

అంతకుముందు పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి వీడియోలో తనని బిగ్ బాస్ కి తీసుకోమంటూ రిక్వెస్ట్ చేస్తూ ఒక మాట కూడా అనేవాడు. కానీ షోలో మాత్రం అసలు తనకి బిగ్ బాస్ అంటేనే తెలియదు అన్నట్టు చెప్పారు. దాంతో పల్లవి ప్రశాంత్ మీద రకరకాల వాదనలు రావడం మొదలు అయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ వాదనలని మరింత పెంచే లాగా ఉంది.

గత సీజన్ లో ఒక ఎపిసోడ్ లో రేవంత్, ఇనాయ, ఆది రెడ్డి డాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఆడియన్స్ లో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులని కెమెరా ఫోకస్ చేసింది. ఇది టెలికాస్ట్ అయినప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు చూస్తే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్ అని అర్థం అయ్యింది. దాంతో, “అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు అన్న వ్యక్తి, గత సీజన్ లో ఆడియన్స్ గా ఎలా వెళ్లాడు?” అని కామెంట్స్ చేస్తున్నారు.

Ads

watch video :

Previous articleఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు..? అసలు స్టోరీ ఏంటంటే..?
Next articleట్రెండింగ్ లో ఉన్న హైదరాబాద్ “లులు మాల్” వీడియోలో ఏం ఉంది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.