ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు..? అసలు స్టోరీ ఏంటంటే..?

Ads

‘బ్యాచిలర్’ మూవీ ఫేమ్ జీవీ ప్రకాశ్ నటించిన సరికొత్త లవ్ స్టోరీ ‘అడియే’. విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సైంటిఫిక్ రొమాంటిక్ మూవీలో గౌరీ జి. కిషన్ కథానాయికగా నటించింది. ఆగస్టులో రిలీజ్ అయిన ఈ మూవీ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం సోనీలివ్ ఆన్లైన్ ప్లాట్ఫారం లో స్ట్రీమింగ్ అవుతోంది.

adiyae movie review

ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ లో కూడా ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏమిటి అంటే…. స్కూల్లో చదువుకునే రోజుల్లో జీవా (జీవీ ప్రకాశ్) సెంథాళినితో లవ్ చేస్తాడు…కానీ సంవత్సరాలు గడుస్తున్న ఆమె దగ్గర తన ప్రేమ గురించి మాత్రం చెప్పలేకపోతాడు. చూస్తూ ఉండగానే ఆమె ఒక ఫేమస్ సింగర్ గా మారిపోతుంది. ఇక్కడ జీవా మాత్రం తన ప్రేమను ఆమెకు ఎలా అయినా చెప్పాలి అని కలలు కంటూ ఉంటాడు.

Ads

adiyae movie review

అయితే అనుకోకుండా జీవ ఒకసారి వేరే ప్రపంచంలోకి వెళ్లడం జరుగుతుంది. ఆ ప్రపంచంలో జీవా కూడా గాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన చిన్నప్పటినుంచి ఇష్టపడ్డ సెంథాళినిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ ప్రపంచం నుంచి జీవ వాస్తవ ప్రపంచంలోకి రావడంతో అసలు కథ మొదలవుతుంది.

adiyae movie review

ఇక ఈ ప్రపంచంలో కూడా ఎలాగైనా సెంథాళిని ప్రేమను సాధించాలి అని జీవ ఎటువంటి పనులు చేస్తాడు? అతను అనుకున్నది సాధిస్తాడా లేదా? తెలుసుకోవాలంటే ఆన్లైన్లో ఈ మూవీ ని చూడండి. లవ్ స్టోరీ కాన్సెప్ట్ పాతదైన తీసిన విధానం దానికి సైంటిఫిక్ శిక్షణ యాడ్ చేయడం కాస్త వెరైటీగా ఉంది. మొత్తానికి ఈ సినిమా చూసేవారికి మంచి అనుభూతిని ఇస్తుంది

Previous articleఈ రాణిని పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని షరతులు పాటించాలా..? అవి ఏంటంటే..?
Next articleబిగ్‌బాస్ గురించి తెలీదు అన్నాడు… మరి బిగ్‌బాస్ 6 లో ఆడియన్స్ గా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.