ఆ కారణం వల్లే…లాస్ట్ మినిట్ లో విజయ్ దేవరకొండకు “శ్రీలీల” హ్యాండ్ ఇచ్చిందా.?

Ads

టాలీవుడ్ లో అందరు హీరోలు.. సూపర్ స్టార్, పవర్ స్టార్ అని పేర్లు తెచ్చుకుంటుంటే.. వెరైటీగా విజయ్ దేవరకొండ మాత్రం రౌడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఖుషి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. మొదట యావరేజ్ టాక్ అందుకున్న క్రమంగా మంచి సక్సెస్ సాధించాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో ప్రస్తుతం రాబోయే చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నెక్స్ట్ మూవీస్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో అతను చేయబోతున్న నెక్స్ట్ మూవీకి హీరోయిన్ ప్రస్తుతం యూత్ క్రష్ శ్రీ లీల అని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టు పూజా కార్యక్రమాలలో కూడా శ్రీ లీల జోరుగా పాల్గొనింది. సునామీలా టాలీవుడ్ లో చాలా వరకు స్టార్ హీరోల సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల.. విజయ్ కాంబినేషన్ లో మూవీ అంటే కచ్చితంగా హిట్ అవుతుంది అని అతని అభిమానులు ఆశించారు.

 

అయితే ఏమైందో తెలియదు కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మూవీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ శ్రీ లీల ఒక పెద్ద బాంబే పేల్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం సినిమాకి సెట్ అయ్యే మరో హీరోయిన్ కోసం చిత్ర బృందం వేట కూడా మొదలుపెట్టారట. ఇంతకీ శ్రీ లీల ఈ సినిమాకి కమిట్ అయిన తర్వాత వద్దు అనుకోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసా..?

Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఆల్మోస్ట్ బడా స్టార్స్ అందరితో శ్రీ లీల సినిమాలు చేస్తుంది. ఇందులో కొన్ని సినిమాలు ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సినిమాల షూటింగ్ పై వీటి ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి తోడు కొత్త సినిమా తీసుకుంటే ఖచ్చితంగా దానికి డేట్లు ఇవ్వలేని పరిస్థితి…అందుకే ఆమె ఈ అవకాశాన్ని వదులుకోవడమే బెస్ట్ అని ఫీల్ అయింది.

ఇదే రీసన్ తో శ్రీ లీల రవితేజ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తుంది. రవితేజ ,శ్రీ లీల కాంబినేషన్ లో వచ్చిన ధమాకా చిత్రం తర్వాతే ఆమె కెరియర్ ఊపందుకుంది.. మరోపక్క రవితేజ కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కావడంతో మరొక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నాడట. కానీ డేట్ అడ్జస్ట్ కానీ కారణంగా శ్రీ లీల ఆ సినిమా నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఒక స్టార్ హీరోకి అవైలబుల్ గా ఉన్న డేట్స్ కూడా ప్రస్తుతం శ్రీ లీల దగ్గర లేవు అంటే ఆమె ఎంత బిజీగా ఉందో చూడండి.

Previous articleస్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి..! బిగ్‌బాస్ తెలుగు-7 “రతిక” తల్లిదండ్రుల మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!
Next articleమొట్ట మొదటిసారిగా ఆ “సీనియర్ హీరో” తో బోయపాటి శ్రీను సినిమా..? ఎవరంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.