“చంద్రముఖి 2” ట్రైలర్ లో ఈ సీన్ ని ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

Ads

గతంలో సూపర్ స్టార్ రజిని హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా.. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించారు. వినాయక చవితి పండుగ హడావిడి సందర్భంలో సెప్టెంబర్ 15 వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ సినిమా యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ ట్రైలర్ విషయమై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమాలో రామ చంద్ర సిద్ధాంతిగా రావు రమేష్ గారు నటించారు. ఆయన నటనకు ఎవ్వరు ఏ కామెంట్ పెట్టలేరు. కానీ, ఆయన గెటప్ విషయమై సోషల్ మీడియాలో కామెంట్స్ వరదలా వస్తున్నాయి. ఆయన గెటప్ దరువు సినిమాలో విలన్ పార్టీలో గురువుగా కనిపించిన రఘు బాబు గెటప్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

Ads

ఈ విషయం ఇలా ఉంచితే, రాఘవ లారెన్స్ మాత్రం అటు స్టైలిష్ లుక్ లోను, ఇటు రాజావారి లుక్ లోను అదరగొట్టేసాడు. ఇక చంద్రముఖిగా కంగనా నటిస్తోంది. ఆమె లుక్స్ కూడా అదుర్స్ అనే చెప్పొచ్చు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ఆకట్టుకోబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ పి.వాసు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మాజిక్ చేయాలనీ నెటిజన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే.. సిద్ధాంతి గారి గెటప్ విషయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటె బాగుండేది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

watch video:

Previous articleబిగ్‌బాస్ తెలుగు-7 కంటెస్టెంట్ గా వచ్చిన “రతిక” ఎవరో తెలుసా..? ఆమె నటించిన సినిమాలు ఏవంటే..?
Next articleకళ్యాణ్ రామ్ తో నటించిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా.? ఆమె యాక్టర్ అవ్వకముందు ఏం చేసేవారంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.