మొట్ట మొదటిసారిగా ఆ “సీనియర్ హీరో” తో బోయపాటి శ్రీను సినిమా..? ఎవరంటే..?

Ads

బోయపాటి శ్రీను దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. సినిమా అంతా కూడా బోయపాటి స్టైల్ లోనే సాగుతుంది. ఈ సినిమా కొంత మందికి విపరీతంగా నచ్చితే, మరి కొంత మంది మాత్రం, “అసలు లాజిక్ లేని సినిమా” అని అంటున్నారు. బోయపాటి సినిమాలో అంటే సాధారణంగా లాజిక్ అనే పదం సినిమా చుట్టుపక్కల కూడా ఎక్కడ కనిపించదు.

boyapati srinu next movie with this telugu senior hero

ఈ సినిమా కూడా అలాగే ఉంది. అసలు హీరో చేసే కొన్ని పనులు అయితే లాజిక్ లేవు సరే, కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించకుండా ఆ సీన్స్ చిత్రీకరించారు అనిపిస్తుంది. చీఫ్ మినిస్టర్ ఇంటికి హీరో వెళ్లిపోవడం, వాళ్ల కూతుర్లని కిడ్నాప్ చేసుకొని తీసుకురావడం, ఇవన్నీ కామెంట్స్ కి గురి అవుతున్నాయి. అయితే బోయపాటి శ్రీను సినిమాలు బాలకృష్ణకి తప్ప వేరే హీరోకి సూట్ అవ్వవు అని అంటున్నారు.

boyapati srinu next movie with this telugu senior hero

బోయపాటి ఇప్పటి వరకు చాలా మంది యంగ్ హీరోలతో పని చేశారు. భద్ర సినిమా యాక్షన్ సినిమా అయినా కూడా ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దమ్ము, రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ సరైనోడు సినిమా అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోతో తీసినా కూడా, మంచి పాటలు, అల్లు అర్జున్ లాంటి హీరోని అలాంటి ఒక యాక్షన్ సినిమాలో చూడడం అనేది ప్లస్ అయ్యి ఆ సినిమా హిట్ అయ్యింది.

boyapati srinu next movie with this telugu senior hero

ఇప్పుడు స్కంద కి కూడా అంత మంచి స్పందన రావట్లేదు. మరొక పక్క సీనియర్ హీరోలు అయిన వెంకటేష్ తో చేసిన తులసి హిట్ టాక్ తెచ్చుకోగా, బాలకృష్ణ కెరీర్ లోనే గుర్తుండిపోయే సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలను బోయపాటి శ్రీను తెరకెక్కించారు. దాంతో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ అని ఒక గుర్తింపు ఏర్పడింది.

Ads

boyapati srinu next movie with this telugu senior hero

అయితే ఇప్పుడు స్కంద సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోయే హీరో ఎవరు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే బోయపాటి శ్రీను సినిమాలు అందరికీ సూట్ అవ్వవు. కాబట్టి ఆయన నెక్స్ట్ దర్శకత్వం వహించే హీరో ఎవరు? అసలు బోయపాటి శ్రీను స్టైల్ యాక్షన్ సినిమాలో ఆ హీరో చేయగలుగుతారా? ఇలాంటి ప్రశ్నలు నెలకొన్నాయి.

boyapati srinu next movie with this telugu senior hero

బోయపాటి శ్రీను తమిళ్ హీరో సూర్యతో ఒక సినిమా తీస్తున్నారు అనే ఒక టాక్ వచ్చింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తారు అనే వార్తలు వచ్చాయి. అయితే సూర్య తమిళ్ లో తీసిన సింగం సిరీస్ కూడా ఇలాగే యాక్షన్ ఓరియంటెడ్ ఉంటాయి. కాబట్టి సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఊహించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే బోయపాటి శ్రీను ఇప్పుడు మరొక సీనియర్ స్టార్ హీరోతో సినిమా తీస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ కాంబినేషన్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో తీస్తున్నారట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇది పెద్ద ఎత్తున ప్రచారంలో అయితే ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం, “చిరంజీవిని కొత్తగా చూస్తాము” అని కొంత మంది అనుకుంటూ ఉంటే, “బోయపాటి మసాలా సినిమాలు చిరంజీవికి సూట్ అవ్వవు .కాబట్టి అలాంటి కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటేనే నయం” అని మరి కొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా పనిలో బిజీగా ఉన్నారు.

ALSO READ : ఆ కారణం వల్లే…లాస్ట్ మినిట్ లో విజయ్ దేవరకొండకు “శ్రీలీల” హ్యాండ్ ఇచ్చిందా.?

Previous articleఆ కారణం వల్లే…లాస్ట్ మినిట్ లో విజయ్ దేవరకొండకు “శ్రీలీల” హ్యాండ్ ఇచ్చిందా.?
Next article“టైగర్ నాగేశ్వరరావు” సినిమాలో రేణు దేశాయ్ పోషించిన ఈ హేమలతా లవణం ఎవరు..? స్టువర్ట్ పురం కి ఈమె ఏం చేసింది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.