రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ కొన్ని ప్రొడక్ట్స్ మీద రిఫండ్ ఎందుకు ఇస్తుంది…? లాజిక్ ఇదే..!

Ads

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో మనం చిటికెలో మన పనులని పూర్తి చేసుకుంటున్నాము. టెక్నాలజీ అభివృద్ధి అవ్వడం వివిధ రకాల షాపింగ్ యాప్స్ రావడం వలన మనం షాపింగ్ కోసం అసలు చింతించాల్సిన పనే లేకుండా పోయింది. ఈజీగా క్షణాల్లో మనం ఆర్డర్ చేసుకుంటే వారం లేదా అంతకంటే తక్కువ టైంలోనే అవి మన ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఏమైనా కావాల్సి వస్తే మనం ఈజీగా ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు.

నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని మనం ఇంట్లోనే హాయిగా కూర్చుని షాపింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

కష్టపడి బయటకు వెళ్లి షాపింగ్ చేసుకుంటే శ్రమ, టైం వృధా అని భావించి ఎక్కువ మంది ఇంట్లో కూర్చుని షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ చాలా వచ్చేసాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటుగా షాప్ క్లూస్, మింత్రా ఇలా చాలా రకాల సైట్స్ ఉన్నాయి. మనం కొనుగోలు చేయాల్సిన ప్రొడక్ట్ ని బట్టి మనం ఆ వెబ్సైట్స్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన ఒక వారం లేదు అంతకంటే తక్కువ టైంలోనే మనం ఆ ప్రొడక్ట్స్ ని పొందొచ్చు. అయితే ఎప్పుడైనా మీరు ఇది విన్నారా అమెజాన్ లో చాలా మంది షాపింగ్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ ని రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఇచ్చేస్తుంది.

Ads

అయితే ఎందుకు అమెజాన్ లో తీసుకున్న ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఎందుకు చేస్తుందని.. నిజానికి దీని వెనుక పెద్ద లాజిక్కే ఉంది. దీనికి గల కారణం ఏమిటంటే.. ఎక్కువ డబ్బులు కానీ ప్రొడక్ట్స్ ని చాలా పడేస్తుంది అమెజాన్. తక్కువ విలువ చేసే లక్షల ప్రొడక్ట్స్ ని అమెజాన్ రిటర్న్ తీసుకోకుండానే పడేస్తుంది. ఆ వస్తువు విలువ, సెండ్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే కూడా తిరిగి సెల్లర్ కి పంపించే ఖర్చు ఎక్కువవుతుంది. అందుకనే తిరిగి మళ్ళీ సెల్లర్ కి పంపించడం కంటే కూడా వదిలేయడం మంచిదని అమెజాన్ భావిస్తుంది. అందుకనే ఈ విధంగా జరుగుతుంది.

Previous article2022లో ఓవర్సీస్ లో వన్ మిలియన్ వసూల్ చేసిన సినిమాల లిస్ట్..!
Next articleకరోనా తరువాత 2023 లో ఏం అవుతుంది..? ”బ్రహ్మం గారు కాలజ్ఞానం” లో చెప్పిన విషయాలు ఏమిటి..?