ఆసియా కప్ కు దూరం చేయడంతో …వేరే దేశం తరఫున ఆడనున్న ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా.?

Ads

టీం ఇండియా రీసెంట్ గా వెస్టిండీస్, ఐర్లాండ్ల లలో పర్యటిస్తూ తెగ బిజీగా ఉంది. ఆగస్టు 30న ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో పాల్గొనడం కోసం త్వరలో టీమిండియా శ్రీలంకను పర్యటించనుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియన్ ప్లేయర్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం సంచలనంగా మారింది . వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా నుంచి తొలగించబడిన ప్లేయర్ ప్రస్తుతం విదేశీ జట్టుతో ఆడేటందుకు సిద్ధపడ్డాడు.

cricket asia cup

తన కెరీర్ ని కాపాడుకోవడానికి ఈ ఆటగాడు తీసుకున్న కీలక నిర్ణయం ప్రస్తుతం పెద్ద చర్చకు తెరలేపింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు భారత్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్‌లో చివరి మూడు మ్యాచ్లు ఆడడం కోసం ఎసెక్స్ ఉమేష్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 57 టెస్ట్ మ్యాచ్లు, 75 వన్డేలు, 9 టీ20లు ఆడడంతోపాటు 288 వికెట్లు పడగొట్టాడు.

Ads

చివరిసారిగా అతను 2023 ఆస్ట్రేలియా తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొన్నాడు. ఇక తర్వాత నుంచి అతను అంతర్జాతీయ క్రికెట్లో కనిపించిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం అతను ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు అంటే కౌంటీ సర్క్యూట్‌లో హాంప్‌షైర్, నార్తాంప్టన్‌షైర్‌లతో జరిగే మ్యాచ్లకు అందుబాటులో ఉండబోతున్నాడని అర్థం. ఈ క్రమంలో ఎసెక్స్‌లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, జట్టు విజయానికి తన వంతు సహకారం అందిస్తానని ఉమేష్ తెలిపాడు. మరోపక్క భారత్ ఒక మంచి ప్లేయర్ ను దూరం చేసుకుంది అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం.

Previous articleఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Next articleఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లను ఎప్పుడైనా చూసారా.? వాళ్ళు ఏం చేస్తున్నారంటే.?