బరువు తగ్గి రూపునే మార్చేసుకున్న 9 మంది సెలెబ్రెటీలు వీళ్ళే…!

Ads

చాలామంది బాడీ షేమింగ్ కి గురవుతూ ఉంటారు. నటులు కూడా బాడీ షేమింగ్ కి గురవుతూ ఉంటారు కొంత మంది హీరోలు బాగా లావు అయ్యిపోవడం వలన బాడీ షేమింగ్ కి గురైతే కొంతమంది బాగా బరువు తగ్గి బాడీ షేమింగ్ కి గురవుతూ ఉంటారు. చాలా మంది హీరోలు బాగా బరువుగా ఉండే వాళ్ళు బాగా తగ్గి మళ్లీ సినిమాల్లో ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు.

ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకుంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవారు యమదొంగ సినిమా కోసం చాలా చేంజ్ అయ్యి అందరినీ షాక్ కి గురి చేశారు. ఆ తర్వాత నుండి ఎన్నో సినిమాల్లో నటించి ఎన్టీఆర్ అందర్నీ బాగా ఆకట్టుకున్నారు. బరువు తగ్గి పూర్తిగా మారిన నటుల జాబితా ఇపుడు చూసేద్దాం.

  1. జూనియర్ ఎన్టీఆర్:

జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు లావుగా ఉండేవారు కానీ తర్వాత యమదొంగ సినిమా టైం కి బరువు తగ్గి అందరిని షాక్ కి గురి చేశారు రాజమౌళి కూడా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని కొంచెం ఒళ్ళు తగ్గాలని చెప్పారు. ఈ విషయాన్ని మీరు వార్తలు చాలా సార్లు వినే ఉంటారు.

2. కరణ్ జోహార్:

కరణ్ జోహార్ కూడా బాగా బరువు తగ్గిపోయారు. ఈయన కూడా ఒకప్పుడు బాగా బరువుగా వుండేవాళ్ళు. 4 నెలల్లో 17 కేజీలు తగ్గారు. బాలీవుడ్ లో కారం జోహార్ చాలా సినిమాల్లో నటించారు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు.

3. శింబు:

శింబు కూడా బాగా బరువుగా ఉండేవారు. ఒక ఇంటర్వ్యూలో తాజాగా ఈ విషయాలని పంచుకున్నారు శింబు. ప్రతి దానికి బాడీ షేమింగ్ ఏంటో అర్థం అవడం లేదు అసలు మన కల్చర్ లో ఇది ఒక పార్ట్ కూడా కాదు అన్నారు. సినిమా కోసం ఈయన 15 కేజీలు కి పైగా తగ్గారు.

Ads

4. సారా అలీ ఖాన్:

ఏడాదికి పైగా ఈమె బరువు తగ్గడం కోసం ట్రై చేసారు. ఇంచుమించు ఏడాదిన్నర పాటు ఈమె బరువు తగ్గడం కోసం కష్టపడ్డారు ఆ తర్వాత ఎంతో అందంగా మారిపోయింది ఈమె.

5. అలియా భట్:

అలియా భట్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఈమె అందరికీ సుపరిచితమే ఈమె సినిమాల్లోకి రాకముందు ఆరు నెలలు కష్టపడి 20 కేజీలు తగ్గింది. ఇప్పుడు హిందీలో ఒక పెద్ద టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.

6. కుష్బూ:

కుష్బూ కూడా 20 కేజీల బరువు తగ్గి కొత్తగా మారిపోయారు కుష్బూ చాలా మంది టాప్ హీరోల సరసన నటించారు.

7. భూమి ఫెడ్నేకర్‌ :

ఈమె అయితే ఏకంగా 35 కేజీలు బరువు తగ్గింది, బరువు తగ్గిన తర్వాత ఈమెను చూస్తే అవాక్ అవుతారు ఎవరైనా. ఈమె హిందీ సినిమా నటి. మొదట ఈమె అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా రాజ్ ఫిలిమ్స్ సంస్థలో పనిచేసేది 2017లో ధామ్ లాగ కె హైసా సినిమా ద్వారా నటిగా మారింది.

8. అద్నాన్ సామి:

230 కేజీల బరువు ఉండేవాడు ఇతను. తర్వాత 130 కిలోల వరకు తగ్గి పోయారు నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచారు.

9. అర్జున్ కపూర్:

అర్జున్ కపూర్ 50 కేజీలు కి పైగా బరువు తగ్గిపోయారు. అర్జున్ కపూర్ బోనికపూర్ కొడుకు. సహాయ దర్శకుడుకా సహాయ నిర్మాతగా కూడా పని చేశాడు. ఇషాక్ జాదే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ కపూర్.

 

Previous articleవిక్రమార్కుడు లో రవితేజ కూతురుగా నటించిన ఈ అమ్మాయి…. ఇప్పుడు ఎంత అందంగా మారిపోయిందో..!
Next articleమాల్స్ లో టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది..? కారణం ఏమిటి..?