యాత్ర-2 సినిమా అయిపోయాక… హీరో “జీవా” లో ఈ మార్పు గమనించారా..?

Ads

సినిమా అన్న తర్వాత నటులు ఆ సినిమా కోసం చాలా కష్టపడతారు. అందులో హీరో కానీ, మరి ఇతర పాత్రలో నటించిన ఎవరైనా నటులు కానీ సాధారణ పాత్రలో నటిస్తే సరే.

లేదు అంటే ఒకవేళ ఆ పాత్ర కోసం ఎక్కువగా కష్టపడాల్సి వస్తే, సినిమా అయిపోయాక కూడా ఆ పాత్రకి సంబంధించిన కొన్ని విషయాలు ఆ హీరోని కానీ, ఆ నటులని కానీ వదలవు. అలా ఇటీవల జరిగింది. యాత్ర-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన తమిళ నటుడు జీవా. స్వతహాగా జీవా తెలుగు వారే. కానీ ఎక్కువ తమిళ్ సినిమాలు చేసి అక్కడ స్థిరపడ్డారు.

ఇది జీవా డైరెక్ట్ తెలుగు సినిమా. ఇందులో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు. ఈ పాత్ర కోసం తనని తాను చాలా మార్చుకున్నారు. ఇది నిజ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి ఆధారంగా రూపొందించిన సినిమా కాబట్టి. ఆ వ్యక్తి ఎలా అయితే ప్రవర్తిస్తారో జీవా కూడా అలాగే ప్రవర్తించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎలా ఉంటారో అలాగే జీవా ఉండడానికి ప్రయత్నించారు.

jiiva remuneration for yatra 2 movie

Ads

అంటే, జగన్మోహన్ రెడ్డి హావభావాలు, నడిచే విధానం, మాట్లాడే విధానం, చేతుల మేనరిజమ్స్ దగ్గర నుండి చిన్న చిన్న విషయాలను కూడా జీవా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఈ సినిమా చూస్తే ఆ విషయం అర్థం అయిపోతుంది. అయితే సినిమా అయిపోయాక కూడా జీవా పాత్రలో నుండి బయటికి రాలేదు అనే విషయం ఇటీవల తెలుస్తోంది. అందుకు కారణం జీవా ఇటీవల ఒకచోట కనిపించారు. ఇది సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన వీడియో. కానీ జీవా మాత్రం తనలాగా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగానే ప్రవర్తిస్తున్నారు.

change in jiiva after yatra 2 movie

జీవాలో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు ప్రజలకి జీవా అంత పెద్దగా తెలియదు కాబట్టి అంతకుముందు ఎలా ఉండేవారు అనేది ఎక్కువగా చూడలేదు. కానీ తమిళ వాళ్లు జీవాన్ని అంతకుముందు చాలా ఇంటర్వ్యూలలో, బయట చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాత్ర పోషించిన తర్వాత జీవాలో వచ్చిన ఈ మార్పుని అందరూ గమనిస్తున్నారు. ఏదేమైనా సరే ఇది ఒక నటుడిగా జీవాకి ఉన్న అంకితభావం చూపిస్తోంది. పాత్ర కోసం తాను ఎంత కష్టపడ్డారు అనేది ఇది చూస్తే అర్థం అవుతోంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక జీవా నటనని అందరూ మెచ్చుకున్నారు.

watch video :

ALSO READ : మిర్చి మూవీలో డార్లింగే పాటలో హీరోయిన్ అనుష్క ప‌క్క‌న స్టెప్పులు వేసిన ఈ సైడ్ డ్యాన్స‌ర్ ఎవరో తెలుసా?

Previous articleఅనుష్క శర్మ – విరాట్ కోహ్లీ కొడుకు పేరుకి ఇంత అర్థం ఉందా..? 2 భాషల్లో 2 రకాలుగా..?
Next articleబెడిసి కొట్టిన ఐడియా… ఏకంగా కోటి రూపాయలు అడుగుతున్నారా..? అసలు విషయం ఏంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.