ప్రభాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలుసా..?

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఛత్రపతి మూవీ ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ప్రభాస్‌ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లింది.

Ads

ఈ సినిమా విడుదలై 16 ఏళ్లు దాటింది. అయిన కూడా ఎప్పుడు ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయినా ఆడియెన్స్ ఛానల్ మార్చరు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్ మూవీని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. దీనిలో సూరీడు ఓ సూరీడు అంటూ సాగే ఒక సన్నివేశం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. సూరీడు అనే చిన్న అబ్బాయిని ఓ రౌడీ గ్యాంగ్ దారుణంగా కొట్టడంతో, సినిమాలో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న హీరో ప్రభాస్‌ ఒక్కసారిగా వారిపై పడి, రౌడీల బొక్కలు ఇరగగొడతాడు. ఈ సన్నివేశాన్ని చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయి.ఇక ఆ సూరీడుగా నటించిన బాలనటుడి పేరు భశ్వంత్‌ వంశీ, ఆ పాత్రను ఆడియెన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక అతడి గురించి ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అతను ఛత్రపతి మూవీ ఆడిషన్స్‌ కోసం వెళ్లినపుడు, అతను మొదటి రౌండ్‌లోనే ఎంపిక అయ్యాడట. భశ్వంత్‌ ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాడని నమ్మారట రాజమౌళి. ఇక జక్కన్న లెక్క ఇప్పటివరకు తప్పలేదు. సూరీడు పాత్ర మూవీలో నెక్ట్స్ లెవల్‌లో పండింది. మూవీలో ఈ క్యారెక్టర్ హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సూరీడికి, అతని తల్లి (అనిత చౌదరి) పాత్రకు మధ్యలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇక ఈ సూరీడు (భశ్వంత్‌ వంశీ) గురించి చెప్పాలంటే ఇప్పుడు అతను పెద్దోడు అయ్యాడు. ఇటీవల త‌న ఫోటోను భ‌స్వంత్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అంద‌రు ఆశ్చర్యపోతున్నారు. ఛ‌త్ర‌ప‌తి సూరీడు ఇంత ఎదిగిపోయాడా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు హీరోలా ఉన్నావు సూరీడు హీరోగా చేయు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక భశ్వంత్‌ వంశీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: మరణించిన త‌రవాత విడుద‌లైన 6 టాప్ స్టార్స్ సినిమాలు ఏమిటో తెలుసా..?

Previous articleఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన 10 డబ్బింగ్ సినిమాలు ఏమిటో తెలుసా?
Next article2022లో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు.. ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.