రాజమౌళి సినిమాల్లో ఈయన తప్పకుండా నటించాల్సిందే.. కారణం ఇదే..!

Ads

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తో ఒక పెద్ద వండర్ ని క్రియేట్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా దానికి మించి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఇది నిజంగా ఎంతో గొప్ప విషయం. పైగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023లో రెండు నామినేషన్లని సొంతం చేసుకుంది. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలో మరియు ఎం ఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇది నామినేట్ అయింది.

రాజమౌళి కే రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో ఈటీవీలో తెలుగు సోప్ ఒపేరాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టారు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం టీవీ సిరీస్ కి దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ లో మొదటి షార్ట్ ని చేశారు రాజమౌళి. తర్వాత సింహాద్రి సినిమాకి దర్శకత్వం వహించారు.

rajamouli-prathidvani

Ads

ఇలా తన కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పుడు దూసుకు వెళ్ళిపోతున్నారు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమానైనా చేయాలని చాలామంది పెద్దపెద్ద హీరోలు అనుకుంటున్నారు. చాలామంది హీరోలకి రాజమౌళి తో సినిమా చేయడం కలలానే మారింది. రాజమౌళి సినిమాలో ఎక్కువగా మనకి శేఖర్ కనబడుతూ ఉంటాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో శేఖర్ నటించాడు. సింహాద్రి సినిమాలో, సై సినిమాలో కూడా చంద్రశేఖర్ నటించాడు.

అలానే ఛత్రపతి లో కూడా నటించాడు. నిజానికి అతని కెరీర్ ఈ సినిమాతో టర్న్ అయింది. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కి స్నేహితుడిగా నటించాడు శేఖర్. ఆ సినిమాతో శేఖర్ పేరు కాస్త ఛత్రపతి శేఖర్ గా మారింది. విక్రమార్కుడు మగధీర మర్యాద రామన్న మొదలైన సినిమాల్లో నటించి శేఖర్ అందరినీ ఆకట్టుకున్నాడు. రాజమౌళి 12 సినిమాల్లో తొమ్మిది సినిమాల్లో శేఖర్ నటించారు. యమదొంగ, బాహుబలి 1, బాహుబలి 2 లో మాత్రమే శేఖర్ లేడు.

Previous articleతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై గుర్రుగా ఉన్న రాహుల్ గాంధీ !
Next articleఎంపైర్ చేతులో ఈ గాడ్జెట్ ఎందుకు ఉంటుంది..? దాని వెనుక రీజన్ ఏమిటి అంటే..?