”30 ఇయర్స్ పృథ్వీ” కూతురిని చూసారా..? హీరోయిన్ గా రాబోతోంది మీకు తెలుసా..?

Ads

నటుడు పృథ్వీరాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కమెడియన్ గా చాలా సినిమాలు చూసి అందరిని బాగా ఆకట్టుకున్నాడు పృథ్విరాజ్. అప్పట్లో రాజకీయాల్లోకి కూడా ఇతను ఎంట్రీ ఇచ్చి కాంట్రవర్సీలకి గురయ్యాడు ఆ తర్వాత క్షమాపణలు అడిగి మళ్లీ సినిమాల్లోకి వచ్చేసాడు.

ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల చిత్రాల్లో పృథ్విరాజ్ నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసాడు. అత్తారింటికిదారేది, దూకుడు, లౌక్యం ఇలా చాలా సినిమాల్లో పృథ్వీరాజ్ నటించాడు.

పృధ్విరాజ్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం. ఈయన తండ్రి బలిరెడ్డి సుబ్బారావు గారు. రైల్వేలో పార్సిల్ మాస్టర్ కింద పని చేసేవారు అలానే ఈయన నటుడు కూడా. మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ వంటి వారితో కలిసి 60 సినిమాల్లో నటించారు. 1992లో పృథ్వీరాజ్ తండ్రి ప్రభాకర్ రెడ్డి చెప్పడంతో పీజీ పూర్తయ్యాక చెన్నై వెళ్ళిపోయాడు. మొదట్లో హోటల్లో రిసెప్షన్ మేనేజర్ గా పని చేశారు అయితే అలా పని చేస్తున్నప్పుడు ఆయనకి సినిమా అవకాశాలు ఏమీ రాలేదు.

Ads

ఆ తర్వాత సిటీ కేబుల్ లో చేరాడు. ఒకరోజు ఈవీవీ సత్యనారాయణ సినిమాలో నటుల కోసం చూస్తుంటే పృధ్విరాజ్ ఆయన్ని మీట్ అయ్యాడు. అప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ రోల్ ని పృధ్విరాజ్ కి ఇచ్చారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రావు గోపాల్ రావు మేనల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పృథ్వి.

ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలని చేసాడు. పృథ్వీరాజ్ ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ సృష్టించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ డైలాగ్ తో బాగా ఫేమస్ అయిపోయాడు. అయితే సాధారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉంటే వాళ్ల పిల్లలు లేక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

పృథ్వీరాజ్ కూతురు కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పృథ్విరాజ్ కూతురు పేరు శ్రీలు. ఆమె ఇప్పటికే ఒక సినిమాలో నటించింది. పృధ్విరాజ్ సొంతంగా ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అందులో హీరోయిన్ తన కూతురు శ్రీలు ఏ. క్రాంతి కృష్ణ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి.

Previous article”కలెక్టర్” అయ్యుండి కట్నం… ఏం అడిగాడో తెలుసా..?
Next articleమీ ఇంట్లో గీజర్ ఉందా..? అయితే ఎట్టిపరిస్థితిలోను ఈ తప్పులని చెయ్యకండి..!