Ads
గత మూడు నెలలుగా హీరో లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ ని రన్ చేస్తున్నప్పుడే దాని రేటింగ్స్ బాగా పడిపోయాయి. అయినా సీరియల్ ని ఆదరిస్తున్నారంటే అందుకు కారణం రిషి వస్తాడేమో అనే ప్రేక్షకుల ఊహ వాళ్ల చేత సీరియల్ చూసేలా చేస్తుంది.
అయితే ఇప్పుడు రిషి డై హార్ట్ ఫ్యాన్స్ కోపంతో ఒళ్లు మండిపోయే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతో కోపంతో రగిలిపోతున్నారు రిషి అభిమానులు.
ఇంతకీ ఏం జరిగిందంటే వసుధార నవ్వుతూ రిషి ఫోటో దగ్గర క్యాండిల్ వెలిగించేసింది. అంతేకాదు నవ్వుతూ క్యాండిల్స్ వెలిగించడాన్ని రిషి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫోటోని షేర్ చేసింది ఎవరో కాదు గుప్పెడంత మనసు సీరియల్ లో శైలేంద్ర పాత్ర పోషిస్తున్న సురేష్ బాబు. తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేయడంతో మర్యాదగా డిలీట్ చెయ్యు అంటూ రిషి ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
అసలు మీకు మనసు ఎలా ఒప్పుతోంది, ఒక మనిషిని ఇంత దారుణంగా దిగజార్చుతారా, అసలు రిషి లేకుండా మీరంతా ఉన్నారా? అతను షూటింగ్ కి రావడం లేదని కక్ష కట్టి ఇంత దారుణంగా చావుని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సిగ్గుండాలి అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రిషి బ్రతికున్నాడో లేదో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న డై హార్ట్ ఫ్యాన్స్ కి రిషి ఫోటో దగ్గర నవ్వుతూ క్యాండిల్స్ వెలిగించడానికి చూసి చలించిపోయారు.
అయితే కొత్త క్యారెక్టర్ మనుతో వసుధారని జత చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారేమో అనే ఊహ ప్రేక్షకులకి వస్తుంది. అయితే మాత్రం రిషి ఫోటోకి దండలు వేయటం, క్యాండిల్ వెలిగించే సీన్లు అవసరమా అంటూ తెగ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సీన్లు మళ్ళీ మళ్ళీ దర్శకుడు చూపిస్తే త్వరలోనే ఈ సీరియల్ కి ముగింపు పలకాల్సిన పరిస్థితిని తీసుకువచ్చేలాగా ఉన్నారు ఆడియన్స్.