BHAMAKALAPAM 2 REVIEW : “ప్రియమణి” నటించిన భామాకలాపం 2 అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ప్రియమణి, కొంత కాలం క్రితం భామాకలాపం అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆహాలో విడుదల అయిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించారు. ఇది ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం: భామాకలాపం 2
  • నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, చైతు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, అనీష్, సుదీప్ వేద్.
  • దర్శకుడు: అభిమన్యు
  • స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ : ఆహా
  • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
  • నిర్మాత : బాపినీడు, సుధీర్
  • రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 16, 2024

bhamakalapam 2 review

కథ:

గతంలో, అంటే పార్ట్ 1 లో జరిగిన సంఘటనల వల్ల ఇల్లు మారిపోయి తన పని తాను చూసుకుంటాను అని చెప్పి భర్తకి మాట ఇస్తుంది అనుపమ (ప్రియమణి). తన ఇంట్లో పని చేసే శిల్ప (శరణ్య ప్రదీప్) తో కలిసి హోటల్ ప్రారంభిస్తుంది. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ హోటల్ ప్రారంభిస్తుంది. అప్పుడు అనుకోకుండా అనుపమకి ఒక సమస్య వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారిని ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అధికారి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? అనుపమ మళ్లీ దొంగతనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనుపమ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే.

bhamakalapam 2 review

విశ్లేషణ:

సైలెంట్ గా రిలీజ్ అయ్యి కొన్ని సూపర్ హిట్ అయిపోతాయి. అందులో ఇది కూడా ఒకటి. సాధారణంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు రావడమే చాలా తక్కువగా జరుగుతుంది. అలాంటిది ఇంత మంచి పాత్ర ఉన్న ఒక సినిమా రావడం, దానికి మళ్లీ కొనసాగింపుగా మరొక భాగం కూడా రావడం అనేది ప్రియమణి విషయంలో జరిగింది. మొదటి పార్ట్ లాగానే ఇందులో కూడా కథ ఒక వస్తువు చుట్టూనే తిరుగుతుంది. కానీ దాన్ని ఆసక్తికరంగా రాసుకున్నారు.

bhamakalapam 2 review

Ads

చూస్తున్నంత సేపు కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తి వస్తుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అనుపమ అని పాత్రలో ప్రియమణి జీవించారు. ఒక సాధారణ గృహిణి పాత్రలో, సమస్యలు వచ్చినప్పుడు బాధపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే పాత్రలో నటించారు. ఈ పార్ట్ లో చాలామంది నటులు యాడ్ అయ్యారు. అందులో రన్ రాజా రన్ హీరోయిన్ సీరత్ కపూర్ ఒకరు. సిరత్ కపూర్ ఇందులో జుబేదా అనే పాత్రలో నటించారు. చూడడానికి చాలా గ్లామరస్ గా కనిపించడంతో పాటు యాక్టింగ్ కూడా బాగుంది. శరణ్య ప్రదీప్ నటన కూడా మంచి కామెడీ టైమింగ్ తో బాగుంది.

bhamakalapam 2 review

మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. దీపక్ సినిమాటోగ్రఫీ సహజంగా అనిపిస్తుంది. విప్లవ్ నైషద్ ఎడిటింగ్ బాగుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి. కానీ అవి పెద్దగా పట్టించుకునే అంత పొరపాట్లు కావు. అంతే కాకుండా దీనికి పార్ట్ 3 కూడా ఉంటుంది అని చివరిలో చెప్తారు. కొన్నిచోట్ల మాత్రం కాస్త లాజిక్ తప్పినట్టు అనిపిస్తుంది. అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • స్క్రీన్ ప్లే
  • టెక్నికల్ టీం పనితనం
  • పాత్రలు డిజైన్ చేసిన విధానం

మైనస్ పాయింట్స్:

  • సాగదీసినట్టుగా ఉన్న పోర్షన్స్
  • లాజిక్ లేని కొన్ని సీన్స్

కుటుంబంతో చూడవచ్చా?

సాధారణంగా ఓటీటీలో విడుదల అయ్యే వాటికి సెన్సార్ కట్స్ ఎక్కువగా ఉండవు. కాబట్టి కొన్ని సార్లు కుటుంబంతో చూడడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఎటువంటి సందేహం లేకుండా కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. అభ్యంతరకరమైన సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఒక్కచోట కూడా ఉండవు.

రేటింగ్:

3.25/5

ఫైనల్ గా:

కథనం బాగుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. కానీ అవి ఏమి పట్టించుకోని అంత పెద్దగా కాకుండా మొత్తం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి పార్ట్ లాగానే ఇది కూడా కామెడీ, ఇటు సస్పెన్స్ బ్యాలెన్స్ చేసినట్టు ఉంది. పార్ట్ 1 ఎంజాయ్ చేసినవారు పార్ట్ 2 తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కొంచెం కామెడీ, కొన్ని ట్విస్ట్ లతో భామాకలాపం 2 ఒక మంచి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : ఓయ్ సినిమా డైరెక్టర్ భార్య ఇంత పెద్ద సెలబ్రిటీ అని తెలుసా..? ఆమె ఎవరంటే..?

Previous articleహీరో “వేణు” భార్యని ఎప్పుడైనా చూసారా.? ఆమె రన్ చేసే ఈ బిజినెస్ గురించి తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే.!
Next article“ఇలా పెట్టడానికి సిగ్గుగా అనిపించట్లేదా..? అంటూ… “గుప్పెడంత మనసు” యాక్టర్ పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?