Ads
పెళ్లయిన తర్వాత అమ్మాయిలు మరొకరి ఇంటికి వెళ్తారు. అక్కడ భర్త తో పాటు అత్తమామలు ఉంటారు. అత్తమామలతో వివిధ గొడవలు కూడా ఎదురవుతూ ఉంటాయి. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. నిజంగా పెళ్లి తర్వాత ఒకేసారి జీవితం అంతా మారిపోతూ ఉంటుంది.
అబ్బాయిలకి పెళ్లి తర్వాత ఎటువంటి భయం ఉండదు కానీ అమ్మాయిలకి భయం ఎక్కువగా ఉంటుంది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు ఎంతగానో ఆందోళన పడుతూ ఉంటారు.
పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఎలా ఉండాలి పెరిగిన బాధ్యతలని ఎలా పూర్తి చేయాలి ఇటువంటివన్నీ వాళ్ళ మెదడులో నడుస్తూ ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి అయితే ఉద్యోగాన్ని ఇంటిని రెండిటిని ఎలా
మేనేజ్ చేయాలి అని భయపడుతూ ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థలో అమ్మాయిలకి పెళ్లి అయిన తర్వాత కండిషన్స్ పెడుతూ ఉంటారు. అయితే ఒక అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత అత్తింటి వారు పెట్టిన కండిషన్స్ లిస్ట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. మరి ఆ అత్తగారు పెట్టిన కండిషన్స్ ఇప్పుడు చూద్దాం.
Ads
ఆమె వారి అనుమతి తీసుకుని చెయ్యాల్సిన పనులు, ఎలాంటి వాటిని చెయ్యకూడదు ఇటువంటివి అన్నీ పెట్టారు. మరి ఆ కండిషన్స్ ని మీరూ చూసేయండి. ప్రస్తుతం ఇది ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. తమిళంలో వున్నా లిస్ట్ ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఒంట్లో బాగోలేదంటే చెప్పకూడదు, భార్యకు మెయిన్ గేట్ తాళం ఇవ్వకూడదు, ప్రతి రోజు ఎనిమిది గంటలకు అన్ని పనులు పూర్తి చేసేయాలి, తల్లిదండ్రులు రాకూడదు, అవసరం ఉంటే తప్ప బయటకి వెళ్ళకూడదు, ఏమైనా కావాలంటే భర్త కి చెప్పకూడదు కేవలం అత్తగారికి చెప్పాలి. ఇలా కొన్ని ఈ లిస్ట్ లో వున్నాయి. ఈ కాలంలో కూడా ఇలాంటి కండిషన్స్ ఉండండం ఎంతో ఘోరం. ఈ రూల్స్ పురుషుడికి ఎందుకు వర్తించవు అని అంతా ప్రశ్నిస్తున్నారు.