హిందూ పద్ధతిలో కూతురి పెళ్లి జరిపించిన ముస్లిం దంపతులు..! ఇలా ఎందుకు చేశారంటే..?

Ads

మనుషులందరూ ఒక్కటే. కులాలు, మతాలు అనే భేదాలు ఉండవు. ప్రతి మనిషి అవతలి వారిని మనిషిలాగా మాత్రమే చూస్తారు. కాలం మారింది. కాలంతో పాటు మనిషి ఆలోచన విధానం కూడా మారుతూ వచ్చింది. మనుషులకి గౌరవం ఇవ్వడం అనేది పెరిగింది. ఇదే విషయం మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. మనుషులందరినీ గౌరవించాలి అని ఈ సినిమాల్లో చూపించారు. చాలా మంది ఇప్పుడు ఇదే విషయాలని అనుసరిస్తున్నారు కూడా. ఈ ఫోటోలో వాళ్లు చేసిన పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. వివరాల్లోకి వెళితే, ఇక్కడ ఉన్న జంట ముస్లిం జంట అని తెలుస్తోంది. వాళ్లు వాళ్ల అమ్మాయికి హిందూ పద్ధతిలో పెళ్లి చేశారు. అందుకు కారణం ఉంది.

couple and daughter story

Ads

కేరళ రాష్ట్రంలోని కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్లా, ఖదీజా అనే ఒక ముస్లిం జంట ఒక తల్లిదండ్రులు లేని పది సంవత్సరాల హిందూ బాలికని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయికి 22 ఏళ్ళు వచ్చినప్పుడు హిందూ ఆచారాలతో, హిందూ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. దాంతో, ఆ బాలిక, ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి ఈ జంటకి కాళ్ళకి నమస్కరించారు. ఈ విషయాన్ని కోరాలో దుబాయ్ ఫ్రెండ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి షేర్ చేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ, “ఇది ఒక నిర్వచనం గా భావించాలి . మతాలు వేరియిన మంచి మనిషి యొక్క స్వభావాలు ఒక్కటే అనుకోవచ్చు నూటికి నూరుపాళ్లు ఎవరయినా. కేరళవాసులు మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు అన్నీ రంగాలలో.”

“కానీ వారి ప్రత్యేకం ఏమిటి అంటే ఏ మతస్థుడు అయిన కేరళ మాతృ భాషలోనే మాటాడుకోవటంమే గాకుండా వారి వారి పవిత్ర మత గ్రంధాలను మాతృ బాషలోనే ఆయా దేవయాలలోని సంభో దించటం వారియొక్క ఔనతయం అని చెప్పుకోవాలి. గల్ఫ్ దేశాలలో మలయాళం రేడియో చానెల్ ( FM ) band ఉంది అంటే వారి యొక్క మాతృ భాశ మీదఉన్న మమకారం ఎంత గొప్పదో మనము తెలిసికోవాలి.” అని రాశారు. ఈ వ్యక్తి షేర్ చేసిన ఈ ఫోటోకి వాళ్ళ మంచి మనసుని ఎంతో మంది అభినందిస్తున్నారు. బంధాలకి విలువ ఇస్తే ప్రపంచం అంతా బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : ప్రేయసి కోసం కోట్ల జీతం వ‌దిలి క‌లెక్ట‌ర్ అయ్యి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

Previous articleపెద్ద కూతురికి శ్రీదేవి రాసిన ఉత్తరం..! ఇందులో ఏం ఉందంటే..?
Next articleకాళోజీ నారాయణరావు గొప్పదనం ఏంటి..? ఆయన అంటే ఇప్పటికి కూడా ప్రజలకి ఎందుకు ఇంత అభిమానం..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.