ఈ ఫొటోలో ధనుష్ తో ఉన్న పాన్ ఇండియా స్టార్ ఎవరో గుర్తుపట్టారా.? అప్పుడు సైడ్ ఆర్టిస్ట్.!

Ads

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అతని చుట్టూ కొంతమంది గ్యాంగ్ ఉన్నారు. అయితే ఆ గ్యాంగ్ లో హీరో ధనుష్ వెనకాలే నిల్చున్న ఒక వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ధనుష్ వెనకాల వెళుతున్న ఆ వ్యక్తి ప్రస్తుతం ఒక పాన్ ఇండియా స్టార్. ఆయనకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు..కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్.. అలియాస్ విజయ్ సేతుపతి. ఒకప్పుడు విజయ్ సేతుపతి అంటే ఎవరో కూడా తెలియదు.

Ads

కానీ ఈ ప్రస్తుతం మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. అంతేకాకుండా ఒకప్పుడు ధనుష్ వెనకాల నిలబడిన విజయ్ సేతుపతి గత ఏడాది ధనుష్ తో పాటు నేషనల్ అవార్డుని అందుకున్నాడు. దాంతో ఓల్డ్ ఫోటోతో పాటు గత ఏడాది అవార్డుని అందుకున్న ఫోటోని కూడా జతచేసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే విజయ్ సేతుపతి విషయానికి వస్తే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతోపాటు వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.

కెరియర్ మొదట్లో హీరో స్నేహితుడిగా సహాయ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి ప్రస్తుతం విలన్ గా కూడా రాణిస్తున్నారు. 2012లో పిజ్జా మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు విజయ్. తెలుగుతోపాటు తమిళం సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఇక తెలుగులో విజయ్ సేతుపతికి భారీగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా అంటే ఉప్పెన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాకుండా ఉప్పెన సినిమా తర్వాత తమిళంలో తెలుగులో విజయ్ కి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.

Previous article‘ఈ పండగ మనదే’ అంటున్న ఈటీవీ .. తెలుగు నూతన సంవత్సరం ‘ఉగాది’ సందర్భంగా సరికొత్త హంగామా
Next articleUGADI RASHI PHALALU 2024 – 2025: శ్రీ క్రోధి నామ సంవత్సర “ఉగాది” రాశి ఫలాలు 2024…ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.