ఏటీఎం పిన్ కి ఎందుకు ”4” డిజిట్స్ ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?

Ads

ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం ఈజీగా మారిపోయింది బ్యాంకుకు వెళ్లి లైన్ లో నిల్చుని తీసుకునే అవసరం లేకపోయింది. బ్యాంకు వేళల్లో కాకుండా మిగిలిన సమయం లో డబ్బులు కావాలన్నా కూడా ఏటీఎం కి వెళ్లి మనం డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఏటీఎం లకి వెళ్లడం కూడా చాలా మంది మానేశారు.

అయితే ఏటీఎం లో డబ్బులు తీసుకోవాల్సి వస్తే మనం కార్డుని పెట్టిన తర్వాత 4 అంకెల పిన్ ని ఎంటర్ చేయాలి ఈ పిన్ ని రహస్యంగా ఉంచుకోవాలి.

ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా మన కార్డు దొరికినా కూడా డబ్బులు తీసుకోవడానికి అవ్వదు. అందరితోనూ ఈ పిన్ ని షేర్ చేసుకోకూడదు. అయితే ఎందుకు నాలుగు అంకెలే ఉంటాయి అని సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? ఈమెయిల్ లేదంటే సోషల్ వర్కింగ్ సైట్స్ కి ఆరు లేదా అంత కంటే ఎక్కువ నెంబర్లు పాస్వర్డ్ కింద ఉపయోగించాలి.

Ads

ఏటీఎం కి కేవలం 4 అంకెలే ఎందుకు ఉంటాయి దాని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏటీఎంలను స్కాట్ లాండ్ కు చెందిన జాన్ ఆడ్రియన్ షెపర్డ్ బార్ కనుగొన్నారు. వీటి వాడకం
1967నుండి వుంది. ఆయన కనిపెట్టిన మిషన్లు కావు కానీ ఆ మిషన్ కంటే ఇవి కాస్త అడ్వాన్స్ అంతే తేడా. సెక్యూరిటీ కోసం పిన్ నెంబర్ ని పెట్టారు ఆయన.

మొదట ఆరు డిజిట్స్ ని పిన్ గా పెట్టారు కానీ ఇవి గుర్తు పెట్టుకోవడం కష్టం అని ఆండ్రియన్ భార్య వద్దన్నారు. నాలుగు అంకెలు ఉంటే మంచిది అని చెప్పారు. అప్ప‌టి నుంచి ఏటీఎం పిన్ లో నాలుగు డిజిట్స్ ఏ వున్నాయి. అదే దీని వెనుక కారణం. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని బ్యాంకులు ఏటీఎం, క్రెడిట్ కార్డు పిన్ నంబ‌ర్‌ ల‌కి ఆరు డిజిట్స్ కింద మార్చేసింది.

Previous article”డబ్బులు ఇచ్చి ఆస్కార్ ని కొన్నారు” అంటూ… జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ ”షాన్ మట్టతిన్” సంచలన కామెంట్లు…!
Next articleపిల్లల్ని ఇలా గాలి లోకి ఎగరవేసి పట్టుకుంటున్నారు..? ఎన్ని సమస్యలో చూస్తే…మళ్ళీ ఇలా చెయ్యరు..!