మీ భర్తకి మీరు ఎక్కువ నచ్చాలంటే.. ఈ మార్పు చేసి చూడండి..!

Ads

పెళ్లి తర్వాత చాలా మంది భార్యలు మంచి భార్యగా ఉండాలని అనుకుంటారు. భర్తకి వాళ్ళు బాగా నచ్చాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచనా తీరు ఒక్కో విధంగా ఉంటుంది. అయితే అందరికీ అందరూ నచ్చాలని లేదు కానీ ప్రతి భార్య కూడా తన భర్తకి బాగా నచ్చాలని.. లోకువ అవ్వకూడదని.. ఎందులోనూ తక్కువగా ఉండకూడదని అనుకుంటుంది.

అలానే ఉద్యోగం చేసే మహిళలు కూడా నా భర్తకి నేను బాగా నచ్చాలి ఇంకా మంచి స్థాయికి రావాలి.. అందరూ మెచ్చుకోవాలి ఆయన అనుకున్న వ్యక్తిగా నేను ఎలా మారాలి..? ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఆడవాళ్లు మొదట ఇన్ఫీరియారిటీని పక్కన పెట్టేయాలి.

చెప్పడం సులభంగా ఉంటుంది కానీ చేయడం కష్టం. కానీ ట్రై చెయ్యండి. నేను సరిగా చదువుకోలేదు నా భర్త బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగం చేస్తున్నారు.. అందరితో బాగా మాట్లాడుతున్నారు అని చాలా మంది ఆడవాళ్లు ఫీల్ అవుతూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళ వలన కానీ భర్త వలన కానీ చాలా మంది మహిళలు డి మోటివేట్ అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చెప్తే వాళ్లలో వాళ్లు బాధపడుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు. ఇలా ఏదైనా జరిగితే వాళ్లలో వాళ్లకి పదేపదే ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి.

Ads

నా భర్తతో నేను బయటకు వెళితే అందరూ నవ్వుతారా.. లేకపోతే నా భర్తకి గౌరవం దక్కదా.. ఇలా భావిస్తూ ఉంటారు. ఇలా ఈ కారణాల వలన చాలామంది ఆడవాళ్లు ఇంట్లోనే ఉండిపోతారు. బయటికి రారు. ప్రతి ఒక మహిళకి కూడా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. దానిని కచ్చితంగా బయటకు తెచ్చుకోవాలి. ఒకరి కోసం మీ రిలేషన్ షిప్ లో మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకండి.

వాళ్లు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టేయండి. మీలో ఉండే మంచి లక్షణాలు, మీ స్ట్రెంత్ వంటి వాటిని మీరు బయటకు తెచ్చుకోవాలి. అంతేకానీ ఎక్కువగా ఆలోచించకండి. మీ భర్తకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా వుండండి. అది కుదరకపోయిన ఏం పరవాలేదు. కానీ పక్కా మీలో కొన్ని క్వాలిటీస్ మీ భర్తకి నచ్చుతాయి. సో సమస్యే లేదు. అంతే కానీ భయపడకండి. బాధ పడకండి.

Previous articleDasara Review: దసరా మూవీ రివ్యూ&రేటింగ్..నాని హిట్ ను ఎవరూ ఆపలేరు..!!
Next articleపవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ రీమేక్స్ లో.. సూప‌ర్ హిట్ అయిన సినిమాలు ఏవో తెలుసా..?