పవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ రీమేక్స్ లో.. సూప‌ర్ హిట్ అయిన సినిమాలు ఏవో తెలుసా..?

Ads

ఒక భాష నుండి ఇంకో భాషలోకి సినిమాలను రీమేక్ చేయడం సహజమే. చాలా సినిమాలు ఇప్పటికే రీమిక్ చేసారు. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి అన్న విషయం చాలామందికి తెలియదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 12 రీమేక్ సినిమాలు చేశారు వాటిలో తొమ్మిది సూపర్ హిట్ లు అయ్యాయి మరి ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గోకులంలో సీత:

గోకులంలో సీత సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. రాశి పవన్ కళ్యాణ్ సరసన ఇందులో నటించారు. తమిళలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేయడం జరిగింది.

2. సుస్వాగతం:

సుస్వాగతం సినిమా కూడా రీమేక్ చేశారు. సుస్వాగతం సినిమాలో పవన్ సరసన దేవయాని నటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఓ క్లాసిక్ గా కూడా నిలిచిపోయింది. ఈ సినిమాకి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

3. ఖుషి:

ఖుషి సినిమా కూడా రీమేక్ చేసిన సినిమానే. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించారు. ఎస్ జె సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

4. అన్నవరం:

Ads

భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్నవరం సినిమా కూడా రీమేక్ సినిమానే.

5. గబ్బర్ సింగ్:

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ ని ఇచ్చింది. శృతిహాసన్ పవన్ సరసన ఇందులో నటించారు.

6. గోపాల గోపాల:

పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలిసి ఈ సినిమాలో నటించారు. ఓ మై గాడ్ సినిమాకి రీమేక్.

7. కాటమరాయుడు:

పవన్ కళ్యాణ్ శృతిహాసన్ నటించిన కాటమరాయుడు సినిమా కూడా పవన్ కళ్యాణ్ కి హిట్ ని ఇచ్చింది. కిషోర్ పార్థసాని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

8. వకీల్ సాబ్:

వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు బాలీవుడ్ సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ ఇది.

9. భీమ్లా నాయక్:

ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ ని తీసుకువచ్చింది. ఇది కూడా రీమేక్ సినిమానే.

Previous articleమీ భర్తకి మీరు ఎక్కువ నచ్చాలంటే.. ఈ మార్పు చేసి చూడండి..!
Next articleమెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా న‌టించి ఆయ‌న‌కే చెల్లి, త‌ల్లిగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?