హిట్లర్ సినిమాలో మెగాస్టార్ చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Ads

సిని పరిశ్రమలో అడుగు పెట్టినవారు నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తుంది. కానీ కొంతమంది మాత్రం రెండు, మూడు సినిమాలలో నటించినప్పటికి చాలా మంది అభిమానులను పొందుతారు.  అంతేకాక వారికి ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నటిమణులలో రుద్ర అలియాస్ అశ్విని కూడా ఒకరు.

అశ్విని మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ చిత్రంలో ఆయనకి చెల్లెలుగా నటించారు. అన్నాచెల్లల సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీకి కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆమె తెలుగులో చాలా తక్కువ సినిమాలలో నటించింది. అయినా మంచి పాత్రలలో నటించింది.ఆమె తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల చిత్రాల్లోనూ నటించింది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా డైరెక్షన్ చేసిన పుదు నెల్లు పుదు నాతు అనే తమిళ సినిమా ద్వారా రుద్ర ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతేకాకుండా ఆమె మలయాళంలో సుమారుగా పదహారు సినిమాలలో నటించింది. అక్కడ రుద్రకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో హిట్లర్, ఆంటీ, పోలీసు, పెళ్లి చేసుకుందాం సినిమాలలో నటించింది.
రుద్ర అలియాస్ అశ్విని బుల్లితెర పై కూడా తనదైన ముద్రను వేసింది. ఒక్కప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్ అంతరంగాలు, కళంకిత. ఈ సీరియల్స్ వచ్చే సమయంలో ఆడవాళ్లు ఎక్కడ ఉన్నాసరే టివికి అతుక్కుపోయేవారు. వాటిలో హీరోయిన్ ఏడుస్తుంటే టీవి ముందున్న వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకునే వారు.వాటికి అంతగా లేడీ ఫాలోయింగ్ ఉండేది. దానికి ముఖ్య కారణం అందులో నటించిన అశ్విని. ఆమె మళయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగింటి ఆడపిల్లగా గుర్తింపును సంపాదించుకుంది.
అంతలా ఆమె తన నటనతో ఇక్కడి ఆడవాళ్ళకు కన్నీళ్లు తెప్పించింది. సీరియల్స్ జనం అతుక్కుపోయేలా ప్రభావం చూపిన వారిలో అశ్వినిది మొదటి స్థానం అనవచ్చు. ఆమె చాలా తెలుగు సీరియల్స్ లో నటించి తెలుగువారికి చేరువైంది. వాటిలో రుద్రకి అంతరంగాలు, కళంకిత సీరియల్స్ ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే తరువాత కాలంలో తెలుగులో టీవి ఛానల్స్ పెరగడంతో, కొత్త యాక్టర్స్ వస్తుండడం వల్ల అశ్విని కి అవకాశాలు తగ్గిపోయాయి.
ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటూ, అక్కడ సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమె తన ప్రెజెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. రుద్రకి 45 ఏళ్ల వయసు అయినప్పటికీ ఆమె గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. వాటిని చూసిన నెటిజెన్లు అప్పటిలనే అందంగా ఉన్నారని, మళ్ళీ నటించమని కామెంట్స్ పెడుతున్నారు.ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ads

Also read: హీరోల‌కు సూప‌ర్ స్టార్‌, మెగాస్టార్ బిరుదులు ఎలా వచ్చాయంటే…?

 

View this post on Instagram

 

A post shared by ASHWINI NAMBIAR (@officially_ashwini)

Previous articleనటసింహం బాల‌కృష్ణ సినిమాల్లో క‌నపడే కామ‌న్ పాయింట్ ఏమిటో తెలుసా?
Next articleవైరల్ అవుతున్న టెలివిజన్ సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు.. నాగబాబు పెళ్లి ఫోటోలు హైలెట్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.