Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక సినిమా ఓయ్. ఎప్పుడో విడుదలైన ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్ళీ విడుదల చేశారు. కానీ ఈ సినిమాకి అప్పుడు వచ్చిన రెస్పాన్స్ లాగా ఇప్పుడు రాలేదు. అప్పుడు ఈ సినిమాకి అంత పెద్ద ఆదరణ లభించలేదు.
కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా థియేటర్లు బుకింగ్ కి పెడితే హౌస్ ఫుల్ అయిపోయాయి. సినిమా థియేటర్లు అంతా కూడా పేపర్లు ఎగిరేయడం, అరవడం, పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు కూడా గొంతు కలపడం, డాన్స్ చేయడం వంటివి జరిగాయి. ఒక సినిమాని ఇంతగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి ఒక గౌరవం ఓయ్ సినిమాకి దక్కింది.
ఇది రొటీన్ ప్రేమ కథ కాదు. దాంతో అప్పుడు ఉన్న ఫార్ములా ప్రకారం ఈ సినిమా డిఫరెంట్ గా ఉండడంతో ఆశించిన ఫలితం పొందలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా సరే కాన్సెప్ట్ బాగుంటే ఆదరిస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు పేరు ఆనంద్ రంగా. ఓయ్ ఆనంద్ రంగాకి మొదటి సినిమా. అయినా కూడా చాలా బాగా దర్శకత్వం వహించారు. 2014 లో వచ్చిన పొగ అనే సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు.
Ads
సందీప్ కిషన్ హీరోగా నటించిన డీకే బోస్ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల అవ్వలేదు. తర్వాత కాదలి అనే మరొక సినిమాకి కూడా స్క్రీన్ ప్లే అందించారు. వ్యవస్థ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కి హిట్ టాక్ వచ్చింది. అయితే ఆనంద్ రంగా భార్య కూడా మనకి తెలిసిన వారే. ఆమె పేరు సౌమ్య శర్మ. సౌమ్య ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. పెద్ద హీరోయిన్ల సినిమాలు వస్తే సౌమ్య డబ్బింగ్ లేకుండా సినిమానే ఉండదు. అందులోనూ ముఖ్యంగా అనుష్క, కాజల్, నయనతార వంటి హీరోయిన్లకి సౌమ్య చాలా సినిమాల్లో డబ్బింగ్ ఇచ్చారు.
చాలా సంవత్సరాల నుండి అనుష్క నటించిన అన్ని సినిమాలకి సౌమ్య డబ్బింగ్ ఇస్తున్నారు. బాహుబలి, ఇటీవల వచ్చిన మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా అనుష్కకి డబ్బింగ్ చెప్పారు. ఇటీవల వచ్చిన వీరా సింహా రెడ్డి సినిమాలో హనీ రోజ్ కి, పరంపర సిరీస్ లో ఆకాంక్ష సింగ్ కి కూడా డబ్బింగ్ చెప్పారు. ఇంకా ఎంతో మంది హీరోయిన్లకి సౌమ్య శర్మ డబ్బింగ్ చెప్పారు. ఆనంద్ రంగా దర్శకత్వంలో వచ్చిన వ్యవస్థ సిరీస్ లో హీరోయిన్ హెబ్బా పటేల్ కి కూడా సౌమ్య డబ్బింగ్ చెప్పారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్ లకి ఇప్పటికి కూడా సౌమ్య డబ్బింగ్ చెప్తున్నారు.