“ఫ్యామిలీ స్టార్” సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

Ads

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్ ఇంకొక వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పరశురామ్ పెట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేశారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. సినిమా బృందం అంతా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. సినిమా నుండి ఇటీవల విడుదల చేసిన పాటలు హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.

ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ కూడా వచ్చేసింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంచి రిపోర్ట్ ఇచ్చారు అని సమాచారం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఎమోషన్స్ చాలా బాగా చూపించారు అని అన్నారు. కుటుంబం అంతా కూడా కలిసి చూడదగ్గ సినిమా అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో విజయ్ దేవరకొండకి హిట్ పడడం ఖాయం అని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఆర్కిటెక్ట్ పాత్రలో నటిస్తారు అని తెలుస్తోంది.

Ads

సీనియర్ నటి రోహిణి హట్టంగడి, తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జగపతిబాబు, వెన్నెల కిషోర్ కూడా ట్రైలర్ లో కనిపించారు. నాలుగు యాక్షన్ సీన్స్ ఈ సినిమా కోసం డిజైన్ చేశారు. కానీ మిగిలినది అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని రాశారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ మోతాదు ఎక్కువగానే ఉండేలాగా చూసుకున్నారు. సినిమా హైదరాబాద్ నుండి ఫారిన్ కి షిఫ్ట్ అవుతుంది అని తెలుస్తోంది.

అంతే కాకుండా, ఈ సినిమాలో రష్మిక కూడా ఒక అతిధి పాత్రలో మెరుస్తారు అనే వార్త వచ్చింది. సినిమా బృందం ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా బృందం అందరూ కూడా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండ తిరుపతిలో కూడా ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. సినిమాకి సంబంధించిన విషయాల గురించి మీడియా వారితో మాట్లాడారు. దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ALSO READ : వారసుడు సినిమాలోని ‘రంజితమే’ పాటలో హీరోయిన్ రష్మిక కన్నా ఎక్కువగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ గురించి తెలుసా?

Previous articleఒకరి బట్టలని మరొకరు కట్టుకుంటే ఏం జరుగుతుంది..?
Next articleఎవరు ఈ రుక్మిణి కోట..? “జ‌న‌సేన‌” పార్టీలో ఈమె పాత్ర ఏమిటి..?