Ads
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై నటిజెన్లు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీలాంటి స్టార్స్ ఇలాంటి పని చేయడానికి ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించరా…ఆ మాత్రం తెలియదా అని అంటున్నారు. మనతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు…అనే విషయం తెలుసుకోవాలి అన్న చిన్న విషయం కూడా తెలియదా అని ఎద్దేవా చేస్తున్నారు. అయితే హిట్‌మ్యాన్ రోహిత్ అభిమానులు మాత్రం..” ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించే క్రమంలో కాస్త క్రీడా స్ఫూర్తి చూపించడం కూడా తప్పేనా..?”అని రోహిత్ కు మద్దతిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే…ఆసియా కప్ 2023 నేపథ్యంలో గ్రూప్ ఏ లో ఉన్న టీమిండియా.. సోమవారం నాడు నేపాల్ టీం తో తలపడిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ పల్లెకెలెలో జరిగింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలిత బ్యాటింగ్ కి దిగిన నేపాల్ జట్టు 48.2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తరువాత బ్యాటింగ్ కి దిగిన రోహిత్ సేన.. వర్షం ఆటంకం కారణంగా.. ఎటువంటి వికెట్లు నష్టపోకుండా 147 పరుగులు చేసి డీఎల్‌ఎస్ పద్ధతిలో విజయం సాధించింది.
Ads
అయితే ఆట పూర్తి అయిన తర్వాత భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టును ఉత్సాహపరచడానికి నేపాల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచాకు రోహిత్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం కలిసి ఫోటోలు దిగడంపై నటిజెన్లు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ లమిచానేపై బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతను అరెస్టు కూడా అయ్యాడు.
అయితే స్థానిక కోర్టు వెల్లడించిన షరతులకు లోబడి బెయిల్ పై విడుదలైన అతను… ప్రస్తుతం నేపాల్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం ఎత్తివేయడంతో మ్యాచ్లో పాల్గొంటున్నారు. అందుకే నమీబియా స్కాట్లాండ్ ఆటగాళ్లు ట్రై సిరీస్ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన తరువాత సందీప్ కి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా తమ నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అతని ప్రవర్తన కు వ్యతిరేకంగా అతని దూరంగా ఉంచుతున్నట్లు వారు వెల్లడించారు కూడా.
అలాంటిది ఇప్పుడు అలాంటి వ్యక్తికి రోహిత్ శర్మ ఏకంగా ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫోటోలు దిగడం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. రోహిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ఇలాంటి వ్యక్తులతో సన్నిహితంగా మెలిగి ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే మరోపక్షం అభిమానులు మాత్రం ఇది క్రీడా స్ఫూర్తి కింద తీసుకోవాలి అని వాదిస్తున్నారు. ఏదేమైనా ఏదో ఒక రకంగా రోహిత్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాడు.