Ads
మన జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే దాని నుండి బయటపడడానికి చాణక్య చెప్పిన జీవిత సూత్రాలని అనుసరిస్తే ఎంతటి సమస్య నుండి అయినా సరే మనం బయటపడొచ్చు. చాణక్య గొప్ప రచయిత. మంచి సలహాదారునిగా కూడా ఎనలేని కీర్తిని చాణక్య పొందారు. పైగా ఆయనకు ఉన్న జ్ఞానం ఇంత అంతా కాదు. ఆయన ఎన్నో ఆరోగ్య సూత్రాలని కూడా చెప్పారు.
స్నేహితులు మధ్య గొడవలు ఎలా పరిష్కరించుకోవాలి..?, భార్య భర్తలు ఎలా ఆనందంగా ఉండాలి ఇటువంటి విషయాలను ఎన్నో చాణక్య చెప్పారు.
దాంపత్య జీవితానికి సంబంధించి చాణక్య చెప్పిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. వీటిని కనుక భార్యా భర్తలు ఆచరిస్తే ఆనందంగా జీవించొచ్చు. ఏ బాధలు కూడా ఉండవు. భార్య భర్తలు కలిసి ఆనందంగా జీవించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. మరి చాణక్య చెప్పిన సూత్రాల గురించి ఇప్పుడే చూసేద్దాం.
#1. విలువ ఇవ్వకపోవడం::
భార్యాభర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం చాలా అవసరం. గౌరవం ఎంతో ముఖ్యం కనుక తప్పకుండా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుని తీరాలి. ఇతరుల ముందు ఒకరి గురించి ఒకరు అగౌరవంగా అస్సలు మాట్లాడకూడదు. ఇతరుల ముందు ఒకరిని ఒకరు అస్సలు తక్కువ చేయకూడదు.
Ads
#2. అహంకారం:
భార్య భర్తలు అహంకారాన్ని విడిచిపెట్టడం మంచిది. అహంకారం ఉంటే భార్యాభర్తల బంధం మొక్కలైపోతుంది. అహం ఉంటే ప్రతి చిన్న సమస్య కూడా పెద్దదిగా ఉంటుంది. పైగా సమస్య నుండి బయటపడడానికి కూడా అవ్వదు. అహంకారం భార్యకైనా భర్తకైనా వుండకూడదు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అన్నట్టు ప్రవర్తించకుండా…ఒకరికి ఒకరు విలువని ఇస్తూ ఉండాలి.
#3. అబద్దాలు చెప్పడం:
అబద్దాలని అస్సలు చెప్పకూడదు. భార్య భర్తలు ఎప్పుడు కూడా నిజమే చెప్పుకోవాలి. అబద్దాల వలన భార్యా భర్తల మధ్య బంధం ఎక్కువ కాలం నిలవదు కాబట్టి అబద్దాలు అసలు చెప్పకండి. తప్పు చేసినా సరే మీ భాగస్వామి దగ్గర నిజాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే బంధం బలపడుతుంది.
#4. అనుమానం:
అనుమానం వలన కూడా బంధం ముక్కలైపోతుంది. ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్య అనుమానం అపార్థం ఉండకూడదు అని చాణక్య చెబుతున్నారు.
featured image credits: a screenshot from short film “Pellaina Kothalo ( After Marriage )“