రియల్ లైఫ్ బేబీ నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Ads

ఇంటర్ చదివే విద్యార్థిని బేబీ సినిమా రేంజ్ లో నడిపిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా ఇప్పుడు మూడు కుటుంబాలు విషాదంలో మునిగి తేలుతున్నాయి. అమ్మాయి చనిపోవడమే కాకుండా ఆమె ప్రేమికుడి ఆత్మహత్యకు మరియు రహస్యంగా పెళ్లి చేసుకున్న యువకుడి జైలు శిక్షకు కారణంగా మారింది.తెలిసి తెలియని వయసులో చేసినటువంటి ఒక చిన్న తప్పు కారణంగా ఇప్పుడు మూడు కుటుంబాలకు గుండె కోత మిగిలింది. ఒకరితో ప్రేమ.. మరొకరితో రహస్యంగా పెళ్లి…చివరకు స్ట్రెస్ భరించలేక ఆత్మహత్య.. తాను చేసిన పనికి తాను బలైపోవడమే కాకుండా ఇతరుల భవిష్యత్తుతో కూడా ఆడుకున్న ఆ అమ్మాయి కథ వింటే ఎవరికైనా…బేబీ సినిమా కథ బెటర్ అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందినటువంటి 16 సంవత్సరాల జూనియర్ కాలేజీ విద్యార్థిని.. ఆదర్శ్ నగర్ నివాసి అయిన సూర్యప్రకాష్ రావుతో ప్రేమాయణం నడిపింది. మరో పక్క ఇందిరా నగర్ కు చెందిన లెంకా సాయికుమార్ ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. తన లవర్ సాయి కుమార్ తో క్లోజ్ గా ఉండడం సూర్యకి నచ్చేది కాదు.. అలాగే తన భార్య సూర్యాతో క్లోజ్ గా ఉండడం సాయి కి నచ్చేది కాదు.

Ads

దీంతో ఒకసారి ఇద్దరూ వేర్వేరు సమయాలలో ఆమె ఇంటికి వచ్చి కచ్చితంగా ఎవరితో ఉంటావో తేల్చుకోమని చెప్పడంతో అమ్మాయి కంగారు పడింది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఆఖరికి ఆమెకు ఆత్మహత్య శరణం అయింది. తన కూతురు ఉరి వేసుకుని చనిపోవడంతో ఆమె తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్ లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయంతో సూర్యప్రకాష్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇక మిగిలిన సాయి కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ స్టూడెంట్ లో రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో అతను ఇప్పుడు పోలీస్ రిమాండ్ లో ఉన్నాడు.

Previous articleసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో కనిపించిన సుప్రియ ఐసోల ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలుసా?
Next articleరీమేక్ దండయాత్రలు దశ మార్చవు… చిరుకి అభిమాని లేఖ…