పెళ్లికి ఇలాంటి గిఫ్ట్ కూడా ఇస్తారా..? ఈ వీడియో చూశారా..?

Ads

పెళ్లి అంటేనే సరదాలు, సంతోషాలు, బంధువులు హడావిడి కలగలిపిన ఒక వేడుక. పెళ్లిలో సాంప్రదాయాలతో జరిగే పూజలు ఒక హడావుడి అయితే ఫ్రెండ్స్ చేసే అల్లరి ఒకవైపు. అందులోనూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటి ప్రభావమో ఏమో స్నేహితుల అల్లరి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది.

ఆ అల్లరి వీడియోలు తీయడం సోషల్ మీడియాలో పెట్టడం. ఆ వీడియోస్ ని మిగిలిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక పెళ్లి వీడియో తెగ వైరల్ అవుతుంది.

funny marriage gift

పెళ్లికూతురు ముందే పెళ్లి కొడుకు స్నేహితుడి వింత చేష్టలు అందరిని నవ్విస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే పెళ్లి కార్యక్రమంలో ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వచ్చి వధూవరులకి గిఫ్ట్లు ఇస్తూ ఫోటోలు తీయించుకుంటున్నారు బంధువులు, ఫ్రెండ్స్. అలాగే వరుడి ఫ్రెండ్ ఒకతను గిఫ్ట్ తీసుకొని స్టేజి మీదకి వచ్చాడు. ఆ గిఫ్ట్ మట్టికుండ. అది ఫ్రెండ్ కి ఇవ్వకుండా దానిని ఎలా వాడాలో స్టేజి మీద వధువు ముందే చేసి చూపించడంతో వధువుతో సహా అక్కడ ఉన్న బంధువులందరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో రావడంతో తెగ వైరల్ అయింది. ఏది ఏమైనప్పటికీ పెళ్లిళ్లలో యువతీ యువకుల అల్లరి కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. దీనికి సోషల్ మీడియా తోడవడంతో వివాహ కార్యక్రమం అందరికీ వినోద కార్యక్రమంలో కూడా మారుతుంది.

ఈ వీడియో ఈ విధంగా వైరల్ అయితే మరికొన్ని వీడియోస్ లో ఫ్రెండ్స్ చెంబు, చేట, చీపురు కూడా గిఫ్ట్లుగా ఇచ్చి వధూవరులకి షాక్ ఇస్తున్నారు. ఆ తర్వాత నవ్వుకోవటం వధూవరుల వంతు అవుతుంది. అలాగే గేమ్ స్టార్ట్ అనే బోర్డు వధువు చేతిలో పెట్టి గేమ్ ఓవర్ అని బోర్డు వరుడు చేతిలో పెట్టి ఫోటోలు తీయించుకోవడం వధూవరులను ఆటపట్టించడం ఇప్పుడు స్నేహితులకి పరిపాటి అయిపోయింది.

watch video :

Previous articleవ్యాస మహర్షి చేతిరాతతో ఉన్న రాసిన మహాభారతంలోని పేజీలు చూశారా..?
Next articleతెల్ల చీర, ఎర్ర బ్లౌజ్ లో…మల్లెపూలు పెట్టుకొని అటు తిరిగి నించున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?