ఇతరుల శరీరం నుంచే వచ్చే వాసన వలన.. మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుంది..?

Ads

వాతావరణం కాస్త వేడిగా వున్నా లేకపోతే ఎక్కువ పని చేసినా శరీరానికి చెమట పడుతూ ఉంటుంది. ఇది చాలా కామన్. ప్రతి ఒక్కరికి కూడా చెమట పడుతూ ఉంటుంది. అయితే చెమట కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. ఇతరులు శరీరం నుండి వచ్చే చెమట వాసన వలన సోషల్ యాంగ్జైటీ ని తగ్గించుకోవచ్చునని స్వీడన్ పరిశోధకులు చెప్పారు. ఇందుకోసం అధ్యయనం చేశారు. కొందరి చంకల్లోని చెమట శాంపిల్స్ ని తీసుకున్నారు.

మెదడులోని భాగాలపై ఈ చెమట నుండి వచ్చే వాసన ఎలా ప్రభావితం చేస్తుంది అనేది పరిశోధకులు పరిశీలించారు. ప్యారిస్ లో నిర్వహించిన ఒక మెడికల్ కాన్ఫరెన్స్లో ఈ అధ్యయన ఫలితాలని పెట్టారు. వాసన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వాసన చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Ads

ఉదాహరణకి అప్పుడే పుట్టిన శిశువు లో కూడా వాసన పసికట్టే సామర్థ్యం ఉంటుంది. తల్లి తో పాటుగా తల్లిపాలను శిశువు వాసన ద్వారా గుర్తు పడుతుంది. అంతెందుకు కూర రుచిగా ఉందా లేదా అనేది మనం వాసన ద్వారా తెలుసుకోవచ్చు. మన ముక్కు పైన భాగంలో ఉండే రెసెప్టర్లు సువాసనని గుర్తుపడతాయి. ఇక్కడి నుండి వచ్చే సంకేతాలను మెదడు లో ఓ భాగానికి వెళుతుంది. ఈ భాగానికి భావోద్వేగాలతో జ్ఞాపకాలతో గట్టి సంబంధం ఉంటుంది. సోషల్ యాంగ్జైటీ తో బాధపడే వాళ్ళకి ఈ చెమట శాంపిల్స్ ని చూపించారు. వీళ్ళకి మైండ్ ఫుల్ నెస్ లాంటి చికిత్సలు కూడా అందించారు.

ఇంకొంత మందికి స్వచ్ఛమైన గాలివాసనని చూపించారు చెమట వాసనా చూసిన వాళ్ళకి సోషల్ యాంజైటీ తగ్గిందని.. ఇది సహాయ పడిందని తెలుస్తోంది.. అయితే ఏ సమయంలో చెమట అయినా కూడా ఒకేలాంటి ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెప్పారు. ఇతరుల చెమట వాసన ని పీల్చడం వలన కలిగే మార్పులని పరిశోధకులు గమనించారు. ఇది చికిత్సను ప్రభావితం చేసినట్లు గుర్తించారు అయితే దీనికోసం ఇంకా లోతైన అధ్యయనాలు అవసరమని అన్నారు.

Previous articleచిరంజీవి ‘ఘరానా మెగుడు’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Next articleఅబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడతారు..!