మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసిన హీరోయిన్ పెళ్లి ఫొటోస్…ఎవరో గుర్తుపట్టారా.?

Ads

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుడ్ నైట్ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ గుడ్ నైట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వచ్చిన ఈ చిత్రంలో కె. మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీగా నటించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం సౌత్‌ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో మీతా రఘునాథ్ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది.

త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజ‌యం సాధించడం మాత్రమే కాకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నిద్ర, గురక వంటి సాదాసీదా విషయాలను కథా వస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేగా అభిమానులకు అందించారు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. గుడ్ నైట్ సినిమాలో మీతా రఘునాథన్ తన అద్భుతమైన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

2022లో సా నీ నిధూమ్ నీ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు గుడ్ నైట్ చిత్రంతో భారీగా గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన అభిమానులు తనలాంటి భార్య కావాలని సోషల్ మీడియాలో ఎందరో యూత్‌ మాట్లాడుకునేలా చేసింది. భర్త కోసం దేన్నైనా భరించే భార్యగా ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా మెప్పించింది.

ఇది ఇలా ఉంటే మీతాకు పెళ్లి ఫిక్స్ మార్చి 17 న అనగా ఆదివారం నాడు తన స్వస్థలమైన ఊటీలో మీతా  పెళ్లి జరిగింది. గతేది నవంబర్ లో ఆమె నిశ్చితార్తం జరిగింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతారు. ముఖ్యంగా యువత షాక్ అవుతున్నారు. భర్తతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ లో షేర్‌ చేసింది. అభిమానులు మీతాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Previous articleస్వాతంత్ర పోరాటం సమయం నాటి పెళ్లి ఆహ్వాన పత్రిక… పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.!
Next article”నువ్వే కావాలి” హీరోయిన్ గుర్తున్నారా..? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?