26 ఏళ్లకి మొదటి సినిమా… ఎంతోమంది హీరోలు కూడా ఈయనకి అభిమానులు..! ఎవరో తెలుసా..?

Ads

ప్రజలకి హీరోలు అంటే చాలా అభిమానం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా సౌత్ ఇండియాలో హీరోలని దేవుళ్ళలాగా కొలుస్తారు. అందుకే సౌత్ ఇండియాలో హీరోగా పుట్టడం అనేది అదృష్టంగా చాలా మంది హీరోలు భావిస్తారు. ఎంతో మంది నార్త్ ఇండియన్ హీరోలు కూడా సౌత్ ఇండియాలో తమకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను ఏర్పరచుకోవాలి అని, తమ సినిమాలని సౌత్ ఇండియాలో కూడా విడుదల చేస్తూ ఉంటారు. హీరోలు ఎక్కడికైనా వెళ్తే ఇసుక వేస్తే రాలనంత జనం అక్కడికి వెళ్తారు.

guess the hero

తమ అభిమాన హీరోని దూరం నుంచి అయినా సరే ఒక్కసారి చూస్తే చాలు అని ఆనందిస్తారు. అలా చూసిన రోజు వారికి పండుగతో సమానం. అందుకే హీరోలని చూసి కంటతడి పెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అంత అభిమానం. హీరోలని తమ ఇంట్లో వారిలాగా భావిస్తారు. ఇప్పుడు పైన ఉన్న హీరోకి కూడా అలా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రజలు చాలా మంది అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలు కూడా చాలా మంది ఈయనకి అభిమానులు.

Ads

ఈయన వ్యక్తిత్వానికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా చాలా సింపుల్ జీవన విధానం ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఈయనకి అంత మంది అభిమానులు ఉన్నారు. ఈ వ్యక్తి ఎవరో మీలో కొంత మందికి అయినా తెలిసిపోయి ఉంటుంది. ఆయనే. సినిమాలతో అలరించి, గత కొద్ది సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల ద్వారా కూడా దేశాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరొక పక్క రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. అలాగే మూడు సినిమాల షూటింగ్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు ఈ సంవత్సరం విడుదల అవుతున్నాయి. అవి కూడా ఎన్నికల తర్వాత విడుదల అవుతాయి అని సమాచారం. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ALSO READ : పుష్ప-2 కోసం అల్లు అర్జున్ ఇంత కఠినమైన డైట్ పాటిస్తున్నారా..? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అంటే..?

Previous articleప్రేమ పేరుతో ఇలా చేసేవారు కూడా ఉంటారా..? OTT లోకి కొత్తగా వచ్చిన ఈ సినిమా చూశారా..?
Next article“చైనా” వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడరో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!