జగతి మేడమ్ ఇంత చిన్నవారా..? ఈమె వయసు ఎంతో తెలుసా..?

Ads

స్టార్ మాలో ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే సీరియల్ ఈ మధ్య ట్రాక్ మారింది. అప్పటి లాగా నడవట్లేదు. అందులోనూ ముఖ్యంగా జగతి మేడం పాత్రని తీసేశాక సీరియల్ డల్ గా అయిపోయింది.జగతి మేడమ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ సినిమాలో కూడా నటించనున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి.

guppedantha manasu jagathi

Ads

గుప్పెడంత మనసు బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు జ్యోతి రాయ్. ఈ సీరియల్లో హీరో రిషికి తల్లిగా జగతి మేడం పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి ఈమె ఈ పాత్ర ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా జగతి కట్టు, బొట్టుకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో జగతి ఫోటోలను చూసిన నెటిజెన్లు మీమ్స్ చేస్తున్నారు. అయితే సీరియల్ అంత ట్రెడిషనల్ గా ఉండే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే వైరల్ గా మారుతుంటాయి.జ్యోతి రాయ్‌ వయసు 38 ఏళ్లు. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్‌ ఇటీవల వరుసగా తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్లు, జ్యోతి రాయ్‌ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ‘హీరోయిన్ అవ్వాల్సిన క్యారెక్టర్ ని సీరియల్ లో తల్లి పాత్ర చేసారు కదా రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Previous article26 ఏళ్లకి మొదటి సినిమా… ఎంతోమంది హీరోలు కూడా ఈయనకి అభిమానులు..! ఎవరో తెలుసా..?
Next articleకోడలు అత్తకి రాసిన ఉత్తరం ! ఈ రూల్స్ పెట్టకండి అత్తయ్య అంటూ … చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.