Ads
టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్న వెంటనే అందరికీ గుర్తు వచ్చే మొదటి పేరు రతన్ టాటా. ప్రస్తుతం దేశంలోనే దిగ్గజ సంస్థ అయిన టాటా కంపెనీ జమ్సటీ నుస్వానీ టాటా ద్వారా 1868లో స్థాపించడం జరిగింది. మనకు తెలిసి టాటా సంస్థల భాద్యతలు ఎప్పుడు మగవారే నిర్వహించారు అని అనుకుంటాం .కానీ ఆరు ఖండాల్లో విస్తరించినటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఒక మహిళా డైరెక్టర్ నిర్వహించింది అంటే ఎవరు నమ్మలేరు. అసలు ఆమె గురించి చాలామందికి తెలియకపోవచ్చు.. ఆమె ఎవరో తెలుసుకుందాం..
Ads
1925లో టాటా సన్స్ కు మొదట మహిళా డైరెక్టర్ గా ‘నవాజ్బాయి’బాధ్యతలు నిర్వహించారు. ఆమె భర్త రతనీ టాటా మరణించిన తర్వాత కంపెనీ సారధ్య బాధ్యతలు ఆమె స్వీకరించారు. 1925 నుంచి 1965 వరకు 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కంపెనీని నడిపించడమే కాకుండా సంస్థను ఒక స్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం టాటా తరఫున సర్ రతన్ టాటా ఇన్ఎక్స్డ్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు కుకింగ్ ,హ్యాండ్ ఎంబ్రాయిడరీ ,టైలరింగ్, లాండ్రీ లాంటి విభాగాలలో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించడంతోపాటు ఉపాధి మార్గాన్ని చూపించే సంస్థను 1928లో నవాజ్బాయి స్థాపించారు.
రతన్ టాటాకు ఆమె స్వయానా అమ్మమ్మ. చిన్నప్పటి నుంచి ఆమెతో సన్నిహితంగా మెలగడం వల్లే రతన్ టాటాకు ఆమె నుంచి వారసత్వంగా ఎన్నో మంచి ఆలోచనలు వచ్చాయి. అయితే టాటా సంస్థకు ఎన్నో రకాలుగా దిశ నిర్దేశం చేసిన ఇలాంటి గొప్ప మహిళ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.