Ads
చిరునవ్వుతో, స్వయంవరం లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు వేణు తొట్టెంపూడి. 1999 లో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు వేణు. ఆ సినిమా హిట్ అయ్యింది. స్వయంవరం సినిమాకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత మనసు పడ్డాను కానీ సినిమాలో నటించారు.
2000 సంవత్సరంలో వచ్చిన చిరునవ్వుతో సినిమాతో ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యారు వేణు. తర్వాత వీడెక్కడి మొగుడండీ, దుర్గ, హనుమాన్ జంక్షన్, మళ్లీ మళ్లీ చూడాలి, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, శ్రీకృష్ణ 2006, బహుమతి, అల్లరే అల్లరి ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒక తమిళ్ సినిమాలో కూడా నటించారు వేణు. ఈ సినిమా తెలుగులో దుర్గ పేరుతో రూపొందించారు.
Ads
అటు చెప్పవే చిరుగాలి లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు చేస్తూనే, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా వంటి సినిమాల్లో కామెడీ ఉండే పాత్రలు కూడా చేశారు. చింతకాయల రవి, దమ్ము సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. వేణు చివరిగా 2013 లో వచ్చిన రామాచారి సినిమా లో కనిపించారు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇటీవల రిలీజ్ అయిన అతిధి అనే వెబ్ సిరీస్ లో కూడా వేణు నటించారు. 2001 లో వేణు అనుపమని పెళ్లి చేసుకున్నారు.
అనుపమ చెన్నైలో పెరిగారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ చేశారు. అనుపమ ఒక ట్రైన్డ్ ఇంటీరియర్ డిజైనర్ కూడా. అనుపమ “పేజెస్ ఇన్ టైం” అనే ఒక స్క్రాప్ బుకింగ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. అంటే ఒకరికి సంబంధించిన మెమరీస్ అన్ని కలెక్ట్ చేసి ఒక స్క్రాప్ బుక్ రూపంలో ఇవ్వడం. ఇది ఒక్క స్టోర్ లో మాత్రమే కాకుండా వేరే ప్రదేశాలకి కూడా షిప్పింగ్ ఉండేలా కూడా ఏర్పాటు చేశారు.